
ఆ పార్టీ అంతా ఓ తమాషా: మేధాపాట్కర్
ఆమ్ ఆద్మీ పార్టీ మొత్తం ఓ తమాషాగా మారిపోయిందని ప్రముఖ సామాజికవేత్త మేధా పాట్కర్ విమర్శించారు. ఆ పార్టీకి ఆమె శనివారం నాడు రాజీనామా చేశారు. పార్టీ వ్యవస్థాపక సభ్యులైన ప్రశాంత భూషణ్, యోగేంద్ర యాదవ్లను పార్టీ నుంచి బయటకు పంపిన తర్వాత జరుగుతున్న అంతర్గత పరిణామాలను దృష్టిలో ఉంచుకుని ఆమె రాజీనామా చేశారు.
ఢిల్లీలో జరిగిన ఆప్ సమావేశంలో పరిణామాలు దురదృష్టకరమని ఆమె ముంబైలో విలేకరులతో అన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ గెలిచి, అధికారం చేపట్టిన నెల రోజుల్లోనే ఇలా జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలో రాజకీయ సిద్ధాంతాలను మంటగలిపారని అన్నారు. ప్రశాంతభూషణ్, యోగేంద్ర యాదవ్లతో వ్యవహరించిన తీరును విమర్శిస్తున్నట్లు మేధాపాట్కర్ చెప్పారు.