
ఆప్‌లో చేరడంపైనిర్ణయించుకోలేదు
ముంబై: ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)లో చేరే విషయంలో ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ప్రముఖ సంఘ సంస్కర్త మేధా పాట్కర్ తెలిపారు. తాను సభ్యురాలిగా ఉన్న నేషనల్ అలయన్స్ ఆఫ్ పీపుల్స్ మూమెంట్(ఎన్‌పీఎం)తో ఆప్ నాయకుడు యోగేంద్ర యాదవ్ చర్చలు జరిపారని ఆమె గురువారం మీడియాకు తెలిపారు. ఈ నెల 12న ముంబైలో, 23, 24న వార్ధాలో ఎన్‌పీఎం సమావేశాలున్నాయని చెప్పారు. ఇదిలావుండగా ఈ నెల 15 కల్లా ఆప్ పార్టీలో చేరడంపై ఓ స్పష్టత వచ్చే అవకాశముందని ఇటీవల ఇండోర్‌లో మేధా పాట్కర్ తెలిపారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వాన్ని ఆమె ప్రశంసించారు. ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు కేజ్రీవాల్ బృందానికి మంచి ప్లాట్‌ఫామ్ దొరికిందని తెలిపారు.