నన్ను బాగా వేధించారు : అభినందన్‌ | Abhinandan Varthaman Says He Was Mentally Harassed In Pakistan | Sakshi
Sakshi News home page

నన్ను బాగా వేధించారు : అభినందన్‌

Published Sat, Mar 2 2019 7:29 PM | Last Updated on Sat, Mar 2 2019 7:52 PM

Abhinandan Varthaman Says He Was Mentally Harassed In Pakistan - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : శత్రు దేశ యుద్ధ విమానాన్ని తరుముతూ సరిహద్దు దాటి వెళ్లి పాకిస్తాన్‌కు చిక్కిన భారత వైమానిక దళ పైలట్‌ అభినందన్‌ వర్థమాన్‌ను ఆ దేశ ఆర్మీ శారీరకంగా వేధించనప్పటికీ.. మానసికంగా వేధించినట్లు తెలుస్తోంది. దాదాపు 60గంటల పాటు అభినందన్‌ పాకిస్తాన్‌లో ఉన్నారు. ఆసమయంలో ఆయనను పాక్ ఆర్మీ మానసికంగా వేధించిందని అభినందన్ భారత అధికారులకు తెలిపినట్లు ఏఎన్‌ఐ వార్తా ఏజెన్సీ వెల్లడించింది. అయితే..దీనిపై పూర్తి సమాచారం రావాల్సి ఉంది. (అభినందన్‌ ఆగయా..)

పాకిస్తాన్‌ ప్రతీకార దాడుల్ని తిప్పికొట్టే క్రమంలో ఫిబ్రవరి 27న పీఓకేలో మిగ్‌–21 విమానం కూలిపోయి అభినందన్‌ పాకిస్తాన్‌ బలగాలకు దొరికిపోయిన సంగతి తెలిసిందే.ముందుగా అతడిపై అక్కడి స్థానికులు దాడి చేసినా తర్వాత పాక్ ఆర్మీ ఆయనను అదుపులోకి తీసుకొని జాగ్రత్తగా చూసుకున్నట్లు పాక్ అధికారులు వెల్లడించారు. భారత్‌తో పాటు అంతర్జాతీయ సమాజం తీసుకొచ్చిన ఒత్తిడికి తలొగ్గిన పాకిస్తాన్‌.. అభినందన్‌ను శుక్రవారం రాత్రి 9.20 గంటలకు వాఘా బార్డర్ దగ్గర భారత్‌కు పాక్ అప్పగించింది. స్వదేశంలో అడుగుపెట్టిన అభినందన్‌ను ఢిల్లీలోని మిలిటరీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అనంతరం అక్కడి నుంచి ఎయిర్ ఫోర్స్ ఆసుపత్రికి తరలించారు. (అభినంద‌న్‌ను కలిసిన రక్షణ మంత్రి)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement