కించపరిచే వ్యాఖ్యల్ని సహించం..మోదీ | 'Achhe Din Are Here', Says Prime Minister Narendra Modi | Sakshi
Sakshi News home page

కించపరిచే వ్యాఖ్యల్ని సహించం..మోదీ

Published Mon, Jun 1 2015 4:21 PM | Last Updated on Wed, Aug 15 2018 6:34 PM

కించపరిచే వ్యాఖ్యల్ని సహించం..మోదీ - Sakshi

కించపరిచే వ్యాఖ్యల్ని సహించం..మోదీ

న్యూఢిల్లీ:  కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఏడాది పూర్తయిన నేపథ్యంలో జరుగుతున్న వేడుకల సందర్భంగా  ప్రధానమంత్రి నరేంద్రమోదీ యూఎన్ఐ తో మాట్లాడారు.   మైనారిటీలకు వ్యతిరేకంగా వ్యాఖ్యానించడం సరైనది కాదంటూ  పరోక్షంగా సంఘపరివార్కు చురకలంటించారు.  ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తరువాత  తొలిసారిగా ఆయన సంఘపరివార్ను  ఉద్దేశించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం  ప్రాధాన్యతను సంతరించుకుంది.

రెచ్చగొట్టే ప్రసంగాలను సహించబోమని,   కించపరిచే వ్యాఖ్యల్ని  ఉపేక్షించబోమని ఆయన తేల్చి చెప్పారు.  ఎలాంటి కుల, మత వివక్షను క్షమించేదిలేదని ప్రధాని స్పష్టం చేశారు. దేశంలో మంచి రోజులు తీసుకురావడంలో  తమ ప్రభుత్వం విజయవంతమైందన్నారు.   రైతుల సంక్షేమం కోసం  తాము ప్రవేశపెట్టిన భూసేకరణ సవరణ బిల్లును  రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement