న్యూఢిల్లీ: బొగ్గు కుంభకోణంలో కవుల్ స్పాంజ్ స్టీల్ సంస్థపై కేసును వుుగిస్తూ సీబీఐ ఇచ్చిన నివేదికను ఢిల్లీ ప్రత్యేక కోర్టు తిరస్కరించింది. సీబీఐ దర్యాప్తు గందరగోళంగా ఉందని, మూసివేత నిర్ణయం సరికాదని పేర్కొంది. ఈ కేసులో తమ ఎదుట హాజరుకావాలంటూ బొగ్గుశాఖ మాజీ కార్యదర్శి గుప్తాతో పాటు మరో ఐదుగురికి సమన్లు జారీ చేసింది. మధ్యప్రదేశ్‌కు చెందిన కమల్ సంస్థతో పాటు ఆ సంస్థ ఉద్యోగులు, పలువురు బొగ్గు శాఖ అధికారులపై పెట్టిన కేసును మూసివేయాలని సీబీఐ నిర్ణయించి కోర్టుకు నివేదిక అందజేసింది.
దీన్ని పరిశీలించిన న్యాయమూర్తి భరత్ పరాశర్.. కేసు మూసివేత సరికాదంటూ నివేదికను తిరస్కరించారు. ఈ కేసులో నిందితులను కాపాడే తరహాలో సీబీఐ చర్యలు ఉన్నాయన్నారు. సరైన మానవ వనరులు లేని కారణంగా బొగ్గు శాఖ అధికారులు కమల్ దరఖాస్తుపై స్క్రూటినీ నిర్వహించలేకపోయారనడం సరికాదన్నారు.
‘నిందితులను కాపాడే చర్య!’
Published Tue, Oct 14 2014 12:23 AM | Last Updated on Sat, Sep 2 2017 2:47 PM
Advertisement