
వ్యూహ, ప్రతివ్యూహాల్లో అధికార, విపక్షాలు
న్యూఢిల్లీ : వివాదాస్పద వివిఐపి అగస్టా వెస్ట్లాండ్ హెలికాప్టర్ల ఒప్పందం అంశం ఇవాళ రాజ్యసభలో చర్చకు రానున్న నేపథ్యంలో అధికార, ప్రతిపక్షాలు వ్యూహ, ప్రతివ్యూహాల్లో నిమగ్నమయ్యాయి. ఓ వైపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం ఉదయం పలువురు సీనియర్ మంత్రులతో భేటీ అయ్యారు. ఈ సమావేశానికి కేంద్రమంత్రులు రాజ్నాథ్ సింగ్, వెంకయ్యనాయుడు, పారికర్ హాజరయ్యారు. అగస్టా వ్యవహారంలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించినట్లు సమాచారం. కేంద్రమంత్రి పారికర్...రాజ్యసభలో ఈ అంశంపై ప్రకటన చేయనున్నారు.
మరోవైపు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ కూడా తమ పార్టీ నేతలతో సమావేశమయ్యారు. అగస్టాపై సభలో అనుసరించాల్సిన వ్యూహం, అధికార పక్షం ఎత్తుగడలను తిప్పికొట్టే అంశంపై చర్చించినట్లు తెలుస్తోంది.