
ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం
న్యూఢిల్లీ : ఢిల్లీ నుంచి హైదరాబాద్ మధ్య నడిచే ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. శనివారం ఉదయం 6.15 గంటలకు ఢిల్లీ నుంచి హైదరాబాద్ బయల్దేరిన విమానంలో గంట ప్రయాణం తర్వాత సాంకేతిక లోపం ఉన్నట్లు పైలట్ గుర్తించాడు. దాంతో అప్రమత్తమైన పైలట్ విమానాన్ని వెనక్కి మళ్లించి ఢిల్లీ విమానాశ్రయంలో అత్యవసరంగా దించి వేశాడు. కాగా ఈ విమానంలో బీజేపీ అగ్రనేత వెంకయ్యనాయుడు ప్రయాణిస్తున్నారు. ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి వేరే విమానం ద్వారా వారిని హైదరాబాద్ పంపిస్తున్నట్లు తెలుస్తోంది.