మత్స్యకారులకు హెచ్చరిక
విశాఖపట్నం: మత్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని విశాఖ తీర వాసులను, అటు తమిళనాడు తీరవాసులను వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ప్రస్తుతం నైరుతి బంగాళా ఖాతంలో వాయుగుండం స్థిర పడింది. చెన్నైకి260 కిలో మీటర్ల దూరంలో ప్రస్తుతం స్థిరపడిన వాయుగుండం మధ్యాహ్నం తుఫానుగా మారే ప్రమాదం ఉంది. దీంతో తీరప్రాంతాలపై అది విరుచుకుపడే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరింది. ఈ రోజు రాత్రి లేదా ఉదయం చెన్నై కారేకల్ తీరం మధ్య పుదుచ్ఛేరి సమీపంలో తీరం దాటే అవకాశం ఉంది. తుఫాను ప్రభావంతో దక్షిణకోస్తా రాయలసీమలో భారీ వర్షాలు పడే అవకాశ ఉందని వెల్లడించింది.
దక్షిణ కోస్తాలో తీరం వెంబడి గంటకు 50-55 కిమీ వేగంతో, ఉత్తర కోస్తాలో 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు బలంగా వీచే అవకాశం ఉందన వెల్లడించింది. ఈ సందర్భంగా నెల్లూరు కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. మత్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని సూచించింది. ముఖ్యంగా ఓడ రేవుల వద్ద ఒకటో నెంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది. మరోపక్క, చిత్తూరు జిల్లాలోని కాళహస్తి, సత్యవేడు, ప్రాంతాల్లో తిరుమలలో కుండపోత వర్షం పడుతోంది.