బడ్జెట్ పై బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా హర్షం వ్యక్తం చేశారు. 2016-17 బడ్జెట్ పేదలు, రైతులకు అనుకూల బడ్జెట్ అని ప్రశంసలు కురిపించారు. బడ్జెట్ లో గ్రామీణ ప్రాంతాలపై దృష్టి పెట్టడం నిజంగా అభినందనీయమంటూ ప్రధానమంత్రి నరేంద్రమోదీకి, కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రైతులు, పేద, గ్రామీణ భారతాన్ని అభివృద్ధి పరచాలన్న మోదీ ఆశయం.. లక్ష్యాలను ఈ బడ్జెట్ పటిష్టపరిచేదిలా ఉందని అమిత్ షా తెలిపారు.