న్యూఢిల్లీ: ప్రపంచంలో శాంతి, ఐక్యతకు పిలుపునిస్తూ అమెరికాలో శనివారం జరిగే సంగీత కచేరీలో ప్రముఖ సరోద్ విద్వాంసుడు అమ్జాద్ అలీ ఖాన్, ఆయన కుమారులు అమాన్, అయాన్‌లు పాల్గొననున్నారు. ‘చాంట్ 4 చేంజ్’ పేరిట వాషింగ్టన్‌లోని లింకన్ మెమొరియల్‌లో జరిగే ఈ వేడుకలో వీరితో పాటు పలు సామాజిక, రాజకీయ, మత నేపథ్యాల వచ్చే కళాకారులు తమ పాటతో శాంతి కోసం గళమెత్తనున్నారు.
‘చాంట్ 4 చేంజ్ అనేది ప్రపంచంలో శాంతిని నెలకొల్పేందుకు పిలుపునిస్తుంది. అమాన్, అయాన్ ,నేను ఇందులో పాల్గొని శాంతి,సమైక్యతను ప్రతిబింబించే, గాంధీ, మార్టిన్ లూథర్ కింగ్, సూఫీ గురువు అమీర్ ఖుస్రూలతో ముడిపడిన పాటలను ఆలపిస్తాం’ అని అమ్జాద్ చెప్పారు. ముగ్గురు వుయ్ షల్ ఓవర్‌కమ్, వైష్ణవ్ జానాతో, రఘుపతి రాఘవ రాజారాం లాంటి పాటలను, 13 శతాబ్దంలో ఖుస్రూ సృష్టించిన తారానా గాన శైలిని ప్రదర్శించే అవకాశముంది. వీరికి తబలా వాయిద్యకారుడు అభిజిత్ జతకలుస్తారు.
శాంతి కోసం అమ్జాద్ పాట
Published Fri, Oct 7 2016 10:02 AM | Last Updated on Fri, Aug 24 2018 6:25 PM
Advertisement
Advertisement