న్యూఢిల్లీ: బొగ్గు క్షేత్రాల కేటాయింపు కేసు దర్యాప్తులో సీబీఐ విభిన్న పద్ధతులు అవలంబించడాన్ని సోమవారం సీబీఐ ప్రత్యేక కోర్టు ఆక్షేపించింది. జేఏఎస్ పవర్ కంపెనీ కేసు దర్యాప్తులో ఒకే విధమైన పద్ధతి అవలంబించకుండా.. వేర్వేరు విధానాలను ఎందుకు ఉపయోగించారని ప్రశ్నించింది. కేటాయింపు ఫైళ్లను క్లీయర్ చేయడంలో సంబంధిత శాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారా? లేక ఉద్దేశపూర్వకంగానే అలా చేశారా? అని సీబీఐని ప్రశ్నించింది. సీబీఐ సమాధానంపై సంతృప్తి చెందని కోర్టు బొగ్గు శాఖ అధికారులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ సీబీఐ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
బిర్లాపై కేసు ఉపసంహరణ: పారిశ్రామిక వేత్త కుమార మంగళం బిర్లా, బొగ్గుశాఖ మాజీ కార్యదర్శి కేసీ పరేఖ్‌లపై నమోదు చేసిన కేసులను ఈ వారంలోనే ఉపసంహరించుకోనున్నామని సీబీఐ తెలిపింది. ఈ మేరకు సీబీఐ అధికార ప్రతినిధి కాంచన్ ప్రసాద్ సోమవారం ప్రకటించారు.
సీబీఐపై ప్రత్యేక కోర్టు ఆగ్రహం
Published Tue, Aug 26 2014 2:37 AM | Last Updated on Sat, Aug 11 2018 8:45 PM
Advertisement