58 స్థానాలకు పెరగనున్న ఏపీ ఎమ్మెల్సీలు | ap mlcs may rise from 50 to 58 | Sakshi
Sakshi News home page

58 స్థానాలకు పెరగనున్న ఏపీ ఎమ్మెల్సీలు

Published Mon, Mar 2 2015 1:20 PM | Last Updated on Sat, Mar 23 2019 9:03 PM

ap mlcs may rise from 50 to 58

ఆంధ్రప్రదేశ్లో శాసన మండలి స్థానాల సంఖ్య 50 నుంచి 58కి పెరగనుంది. సోమవారం కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ ఏపీ పునర్వ్యవస్థీకరణ బిల్లు లోక్సభలో ప్రవేశపెట్టారు. ఇది విభజన సమస్యలో మరో ముందడుగని ఆయన పేర్కొన్నారు. ఈ సవరణ బిల్లు ప్రకారం గతంలో ఉన్న స్థానాల సంఖ్య పెరగనుంది. అయితే, దీనిపై టీఆర్ఎస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆ పార్టీ ఎంపీ వినోద్కుమార్ సభలో మాట్లాడుతూ ఇరు రాష్ట్రాలను సంప్రదించాకే ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టాలన్నారు. బిల్లును వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.  




 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement