ఆర్బిట్రేషన్ హబ్‌గా భారత్
ఆ దిశగా న్యాయ సంస్కరణలు చేపడుతున్నాం: ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: తమ ప్రభుత్వం అందరికీ ఆమోదయోగ్యమైన న్యాయ సంస్కరణలకు శ్రీకారం చుట్టిందని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. అంతర్జాతీయంగా భారత్‌ను ఆర్బిట్రేషన్ హబ్(మధ్యవర్తిత్వ కేంద్రం)గా తీర్చిదిద్దాలన్నారు. నిబంధనలు మారలేదని పెట్టుబడిదారుల్లో నమ్మకం కలిగించేందుకు.. వాణిజ్య వివాదాలను సమర్థవంతంగా పరిష్కరించగలిగేందుకు ఒక బలమైన ఆర్బిట్రేషన్(మధ్యవర్తిత్వ) యంత్రాంగం ఉండాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. వివాదాల పరిష్కారానికి ప్రత్యామ్నాయ వ్యవస్థను ఏర్పాటు చేయాలనేది జాతీయ ప్రాధాన్యం గల అంశమన్నారు.
పెట్టుబడులకు సౌకర్యవంతంగా ఉండటమే కాక దీని వల్ల న్యాయస్థానాలపై భారం తగ్గుతుందన్నారు. ‘భారత్‌లో మధ్యవర్తిత్వం బలోపేతం, అమలు దిశగా జాతీయ కార్యక్రమం’ అనే అంశంపై ఢిల్లీలో జరిగిన సదస్సు ముగింపు సందర్భంగామోదీ ప్రసంగించారు. వ్యవస్థాగత ఆర్బిట్రేషన్ వ్యవస్థను ఏర్పాటు చేయాలనేది తమ ప్రభుత్వ ప్రాధాన్య అంశాల్లో ఒకటన్నారు. తాజాగా మధ్యవర్తిత్వం, రాజీ చట్టానికి సవరణలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. వీటి వల్ల మధ్యవర్తిత్వ ప్రక్రియ సులభతరమవుతుందన్నారు. న్యాయ వ్యవస్థలో మౌలిక వసతులు, పాలనను మెరుగుపరిచేందుకు తాము అనేక చర్యలు చేపట్టామన్నారు. హైకోర్టుల్లో వాణిజ్య కోర్టులు, వాణిజ్య డివిజన్, వాణిజ్య అప్పిలేట్ డివిజన్‌కు సంబంధించి రూపొందించిన చట్టం వల్ల వాణిజ్య వివాదాలకు త్వరితగతిన పరిష్కారం లభిస్తుందని చెప్పారు. వస్తు, సేవల పన్ను(జీఎస్టీ చట్టం వల్ల దేశీయ డిమాండ్‌కు మరింత ఊతం లభిస్తుందని, దేశీయ వ్యాపారానికి అవకాశాలు పెరుగుతాయని, కొత్తగా ఉపాధి అవకాశాలు వస్తాయని మోదీ చెప్పారు.
జవాన్లకు దీపావళి శుభాకాంక్షలు చెప్పాలి
సరిహద్దుల్లో దేశ రక్షణ కోసం నిరంతరం కాపలా కాస్తున్న సైనికులకు దీపావళి శుభాకాంక్షలు, సందేశాలు పంపాలంటూ ప్రధాని మోదీ ప్రజలకు పిలుపునిచ్చారు. ఆల్ ఇండియా రేడియో ద్వారా, కడఎౌఠి.జీలో నరేంద్ర మోదీ యాప్‌లో ు్చఛ్ఛీటజి2ౌఛీజ్ఛీటట సందేశాలను పంపొచ్చు. ‘నేను సందేశాన్ని పంపాను. మీరూ పంపొచ్చు. మీ శుభాకాంక్షలు మన జవాన్లకు ఎంతో ఆనందాన్నిస్తాయి’ అని ప్రధాని ట్వీట్ చేశారు. 1.25 కోట్ల మంది జవాన్ల పక్షాన నిలబడితే.. వారి బలం 1.25 కోట్ల రెట్లు పెరుగుతుందన్నారు. కాగా, సోమవారం వారణాసికి వెళ్లనున్నారు.
ప్రభుత్వ సంస్థల తీరు నిరాశాజనం: సీజేఐ
ప్రభుత్వ నేతృత్వంలోని సంస్థల పనితీరు నిరాశాజనకంగా ఉందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) టీఎస్ ఠాకూర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. సంస్కరణలతో వీటిని ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రత్యామ్నాయ వివాద పరిష్కార అంతర్జాతీయ కేంద్రం పనితీరును వివరిస్తూ.. 20 ఏళ్లలో ఈ కేంద్రం 20 కేసుల్నే విచారించిందన్నారు. మధ్యవర్తిత్వానికి ప్రోత్సాహం అందించేలా లీగల్ ఫ్రేమ్‌వర్క్‌ను పునఃసమీక్షించాలని ప్రభుత్వాన్ని కోరారు.