2016-17 కేంద్ర బడ్జెట్ హైలైట్స్ | Arun Jaitley's 2016-17 Budget high lights | Sakshi
Sakshi News home page

2016-17 కేంద్ర బడ్జెట్ హైలైట్స్

Published Mon, Feb 29 2016 1:01 PM | Last Updated on Sun, Sep 3 2017 6:42 PM

2016-17 కేంద్ర బడ్జెట్ హైలైట్స్

2016-17 కేంద్ర బడ్జెట్ హైలైట్స్

న్యూఢిల్లీ : కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్జైట్లీ సోమవారం లోక్సభలో  కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టారు. అంతకు ముందు కేంద్ర మంత్రివర్గం లాంఛనప్రాయంగా బడ్జెట్కు ఆమోదం తెలిపింది. ఇక 2016-17 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆయన

ప్రవేశపెట్టిన బడ్జెట్ లోని ముఖ్యాంశాలు ఇవీ..

మొత్తం బడ్జెట్ ఇదే..
*2016-17 బడ్జెట్ రూ. 19.78లక్షల కోట్లు
*ప్రణాళికా వ్యయం రూ.5.5లక్షల కోట్లు
*ప్రణాళికేతర వ్యయం రూ. 14.28లక్షల కోట్లు

వృద్ధి తీరు ఇలా...
* ఈ ఏడాది 7.6 శాతం వృద్ధి
* రుతుపవనాలు అనుకూలించకపోయినా 7.6 శాతం వృద్ధిరేటు
* అయినా పటిష్టంగా భారత్ ఆర్థిక వృద్ధి
* ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మందగమనం, సవాళ్లు
* తొమ్మిది పునాదులపై బడ్జెట్ ప్రతిపాదనలు
* ఆరు సెక్టార్లలో సంస్కరణలు కొనసాగింపు
* 9శాతం ఉన్న ద్రవ్యోల్బణాన్ని5.4 శాతానికి తగ్గించాం
* ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ప్రయత్నం

లోటు ఎంతంటే...
*ద్రవ్య లోటు 3.5 శాతానికి పరిమితం
*15.3 శాతం పెరిగిన ప్రణాళికా వ్యయం

మార్పు లేదు
ఆదాయపన్ను శ్లాబులు, రేట్లు యథాతథం
కొత్త పన్నుల కారణంగా రూ.19.610 కోట్ల ఆదాయం
*కోటిమంది పన్ను చెల్లింపుదారులకు ఊరట
*5 లక్షల వరకూ ఆదాయం ఉన్నవారికి రిబేట్ పెంపు
* ప్రతి ఏటా 30వేల వరకూ పన్ను మినహాయింపు
* ఇంటి అద్దెపై పన్నుమినహాయింపు రూ.24 వేల నుంచి రూ.60వేలకు పెంపు
* రిబేట్ రూ.2వేలు నుంచి రూ.5వేలకు పెంపు
* రిబేట్ల ద్వారా ట్యాక్స్ చెల్లింపుదారులకు ఊరట
* పన్ను చెల్లింపుదారులను గుర్తిస్తున్నాం
* ఈ ఏడాది కూడా ట్యాక్స్ ఫ్రీ ఇన్ఫ్రా బాండ్లు

ముక్కుపిండి వసూలు
ట్యాక్స్ ట్రిబ్యునల్కు 11 కొత్త బెంచ్ల ఏర్పాటు
పన్నుల ఎగవేతపై విచారణ వేగం
పన్ను ఎగవేతలను సీరియస్గా పరిగణిస్తాం
పన్ను ఎగవేశామని ముందుకు వస్తే పన్నులో 50శాతం పెనాల్టీతో సరి
లేకుంటే పన్నుకు అదనంగా 200శాతం వసూలు
బ్రెయిలీ పేపర్పై పూర్తిగా పన్ను మినహాయింపు

కార్లతో కాస్త కంగారు
* లగ్జరీ కార్లు మరింత ప్రియం
రూ.10 లక్షల పైబడ్డ కార్లపై ఒక శాతం సర్వీస్ ట్యాక్స్ విధింపు
రూ.2లక్షల వరకూ కార్ల పరికారాలు కొంటే సర్వీస్ ట్యాక్స్ ఒక శాతం అదనం
కార్లు, ఎస్వీయులు, డీజిల్ వాహనాలకు సర్వీస్ ట్యాక్స్ మినహాయింపు
*2015లో అత్యధికంగా మోటారు వాహనాల ఉత్పత్తి

సర్ చార్జీ పెంచేశారు
ఏడాదికి కోటి రూపాయల ఆదాయం ఉండేవారికి సర్ ఛార్జి పెంపు
సర్ ఛార్జి 12 శాతం నుంచి 15 శాతానికి పెంపు
ఈపీఎఫ్ కింద పెట్టుబడి రూ.1.5లక్షలకు పరిమితం
60 చదరపు అడుగల ఇంటి నిర్మాణంపై సర్వీస్ ట్యాక్స్ మినహాయింపు

వెండికి ఓకే.. బ్రాండెడ్తో బాదుడు
*వెండి తప్ప, ఇతర నగల మీద 1 శాతం అదనపు ఎక్సైజ్ డ్యూటీ
*బ్రాండెడ్ రెడీమేడ్ వస్త్రాల మీద అదనపు పన్ను
*కోల్, లిగ్నైట్ మీద అదనపు పన్ను

ఖరీదైన పొగ
*బీడీలు తప్ప పొగాకు ఉత్పత్తులపై ఎక్సైజ్ పన్ను 15 శాతానికి పెంపు

కాస్త ఊరట
*నిర్మయ పథకాలకు సర్వీస్ ట్యాక్స్ మినహాయింపు
*రిటైర్మెంట్ సమయంలో విత్ డ్రాల్స్ పన్ను నుంచి మినహాయింపు
* జాతీయ పెన్షన్ పథకం నుంచి విత్ డ్రాలపై ఊరట
*మూడేళ్లలో ప్రతి పోస్టాఫీసులో మినీ ఏటీఎం, మైక్రో ఏటీఎంలు
*స్టార్టప్ కంపెనీలకు ఊతం ఇచ్చేందుకు కంపెనీల చట్టంలో మార్పులు
*విత్తనాల నిల్వకు రూ.900 కోట్లు

అన్నిటికీ ఆధారే..
* ఆధార్ ఆధారంగానే సబ్సిడీలు, రుణాలు
*100 కోట్లమందికి ఆధార్ ద్వారా ఆర్థిక సేవలు
*ఈ ఏడాది ముద్ర బ్యాంకు కింద రూ.2.5 కోట్లమందికి రుణాలు
*ప్రభుత్వ రంగ బ్యాంకులకు అండ
*బ్యాంకులు, బీమా సంస్థలు దివాళా తీయకుండా కొత్త చట్టం
* బ్యాంకుల పునరుద్ధరణకు రూ.25 కోట్లు
*ఐడీబీఐలో 50శాతం తగ్గించుకోనున్న కేంద్రం

కొత్త ఉద్యోగాలకు ఊతం
*రీటైల్ ట్రేడ్ విభాగంలో చాలా కొత్త ఉద్యోగాలు
*కొత్త ఉద్యోగులకు మూడేళ్ల పాటు ఈపీఎఫ్ పెన్షన్ పథకానికి 8.33 శాతం ప్రభుత్వ కంట్రిబ్యూషన్
*చిన్న దుకాణాలు వారంలో ఏడు రోజులూ తెరిచేందుకు అనుమతి

చదువుకులకు అరకొరే....
* ఉన్నత విద్య చదివేవారికి చేయూత
* వెయ్యి కోట్లతో ఉన్నత విద్యా ఫైనాన్సింగ్ ఏజెన్సీని
*వచ్చే మూడేళ్లలో కోటిమందికి నైపుణ్యంలో శిక్షణ
* వెయ్యి కోట్లతో ఉన్నత విద్యా ఫైనాన్సింగ్ ఏజెన్సీని ఏర్పాటు
* స్కూళ్లల్లో మార్కుల షీట్లు, టీసీలన్నింటికి డిజిటల్ టెక్నాలజీ
*డిజిటల్ అక్షరాస్యత కోసం రెండు కార్యక్రమాలు
*రాబోయే మూడేళ్లలో 6 కోట్ల ఇళ్లకు డిజిటల్ అక్షరాస్యత

ఆరోగ్యం పర్వాలేదు
*డయాలసిస్ పరికరాల మీద బేసిక్ కస్టమ్స్, ఎక్సైజ్ పన్నులు మినహాయింపు
*అన్ని జిల్లా ఆస్పత్రుల్లో పీపీపీ మోడ్‌లో జాతీయ డయాలసిస్ సర్వీస్
*జెనెరిక్ మందులను అందించేందుకు అదనంగా 3వేల దుకాణాలు
*ప్రతి కుటుంబానికి లక్ష రూపాయలు, సీనియర్ సిటిజన్లకు అదనంగా 30 వేలు
*లక్ష కుటుంబాలకు ఆరోగ్య బీమా పథకం
*పశు సంపదకు రూ.850 కోట్లు

విమానాలు.. నౌకలు
* వినియోగంలో లేని ఎయిర్పోర్టు అభివృద్ధికి రూ.150 కోట్లు
* దేశంలో 160 ఎయిర్ పోర్టుల అభివృద్ధి
* ఒక్కో ఎయిర్ పోర్టుకు రూ.50 నుంచి రూ.100 కోట్లు
* తీర ప్రాంతాల్లో 2 గ్రీన్ ఫీల్డ్ పోర్టులు
* గ్రీన్ ఫీల్డ్ పోర్టుల కోసం రూ. 800 కోట్లు ఖర్చు
* డీప్ సీ నుంచి గ్యాస్ తీస్తే ప్రోత్సహాలు
* విద్యుత్ ఉత్పత్తి పెంపుదల కోసం రూ.3వేల కోట్లు
* అణు విద్యుత్ కోసం రూ.3వేల కోట్లు
* సాగర్ మాల ప్రాజెక్ట్ కోసం రూ.80వేల కోట్లు

రవాణా-రహదారులు
*రహదారుల రంగంపై మొత్తం రూ.97వేల కోట్లు ఖర్చు
*రూ.15వేల కోట్లతో బాండ్లు జారీ
* హైవేల నిర్మాణం కోసం బాండ్లు
*హైవేల కోసం రూ.55వేల కోట్లు

ఎస్సీ మహిళకు పెద్దపీట
*ఎస్సీ, ఎస్టీ మహిళా పారిశ్రామిక వేత్తలకు ప్రత్యేక ప్రోత్సహకాలు
* ఎస్సీ, ఎస్టీ మహిళలకు స్టాండ్ అప్ ఇండియా పథకం కింద రూ.500 కోట్లు
*అంబేద్కర్ 125వ జయంతి సంవత్సరం జరుపుకొంటున్నాం.
*ఈ సందర్భంగా జాతీయ ఎస్సీ ఎస్టీ హబ్‌ను ఏర్పాటు చేయాలని ప్రతిపాదిస్తున్నాం.

గ్రామ స్వరాజ్యం దిశగా...
*గ్రామీణాభివృద్ధికి మొత్తం రూ.87,765 కోట్లు
* ఉపాధి హామీ పథకానికి రూ.38,500 కోట్లు
*300 గ్రామాలను పట్టణాలుగా మార్చే ప్రక్రియ
*క్లస్టర్ల కోసం శ్యామప్రసాద్ ముఖర్జీ అర్బన్ మిషన్
*గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీలకు గ్రాంట్ ఇన్ ఎయిడ్గా రూ.2.87 లక్షల కోట్లు
*కేంద్ర పంచాయతీరాజ్ శాఖ రాష్ట్రాలతో కలిసి వీటి అభివృద్ధికి కృషి
*18542 గ్రామాలకు ఇప్పటికీ విద్యుత్ సరఫరా లేదు
*వెయ్యి రోజుల్లో వీటికి సదుపాయం కల్పిస్తామని ఇంతకుముందు చెప్పాం
*ఇప్పటివరకు 5542 గ్రామాలకు విద్యుత్ సదుపాయం
*దీన్ దయాళ్ గ్రామజ్యోతి యోజనకు 8500 కోట్లు
*స్వచ్ఛభారత్ మిషన్‌కు 9వేల కోట్లు
*16.8 కోట్ల గ్రామీణ ఇళ్లలో 12 కోట్ల ఇళ్లకు కంప్యూటర్లు లేవు
*పంచాయతీరాజ్ సంస్థల కోసం రాష్ట్రీయ గ్రామస్వరాజ్ అభియాన్‌కు రూ. 655 కోట్లు
*పేదలలో చాలామందికి ఇప్పటికీ వంటగ్యాస్ సదుపాయం లేదు.
*ఇంట్లో మామూలు పొయ్యి ఉంటే.. గంటకు 400 సిగరెట్లు కాల్చిన దాంతో సమానం
*పేదలకు గ్యాస్ సదుపాయం కల్పించేందుకు రూ. 2000 కోట్లు
*1.50 కోట్ల కుటుంబాలకు దీంతో లబ్ధి, మరో రెండేళ్లు కూడా కొనసాగింపు
* బీపీఎల్ కుటుంబాలకు వంటగ్యాస్ కు కసరత్తు
*పప్పు ధాన్యాల ఉత్పత్తికి రూ.500 కోట్లు
* వృద్ధులకు ఆరోగ్య బీమా పథకం
*ఈపీఎఫ్ కింద కొత్త ఉద్యోగుల కోసం రూ.వేయి కోట్లు కేటాయింపు


రైతన్నకు ఏమిచ్చారంటే..
* సాగునీటి ప్రాజెక్టులకు రూ.86,500 కోట్లు
* 28.5 లక్షల ఎకరాలను సాగులోకి తీసుకొస్తాం
*గత ఏడాదితో పోలిస్తే  రూ.50వేల కోట్లు వ్యవసాయ రుణాల పెంపు
* సాగునీటి రంగానికి రూ.20వేల కోట్లు
* అన్ని వ్యవసాయ మార్కెట్లకు ఈ-మార్కెట్ల సదుపాయం
* ఈ ఏడాది వ్యవసాయ రుణాలకు రూ.9లక్షల కోట్లు
* ప్రధాని రహదారుల పథకానిఇ రూ.19వేల కోట్లు
* వ్యవసాయేతర రంగాల్లో ఆదాయల పెంపుకు కృషి
వ్యవసాయ, మౌలిక వసతుల రంగంపై అదనపు సెస్సు
*విత్తనాల నిల్వకు రూ.900 కోట్లు
* రుణాల మాఫీకి రూ.15వేల కోట్లు
* రానున్న మూడేళ్లలో ఐదు లక్షల హెక్టార్లలో ఆర్గానిక్ పంటలు
*వ్యవసాయానికి రూ.35, 984 కోట్లు
* ఆథార్ కార్డు కింద అందరికీ పథకాలు
*గ్రామీణ ప్రాంతాలు, మౌలిక సదుపాయాలపై ప్రత్యేక శ్రద్ధ
* నామమాత్రపు ప్రీమియంతో ప్రధాని పంటల బీమా
*దేశ ఆహార భద్రతకు వెన్నెముకలు రైతులే
*వెనుకబడ్డ వర్గాల కుటుంబాలకు మూడు పథకాలు ప్రవేశం
* 2020 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు లక్ష్యం
* సంక్షేమం, గ్రామీణ, వ్యవసాయ రంగాలకు ఖర్చు పెంపు
* నీటి లభ్యత పెంచే విధంగా చర్యలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement