
లిఫ్టులో ఇరుక్కున్న అరుణాచల్ గవర్నర్
అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్ జేపీ రాజ్‌ఖోవా లిఫ్టులో ఇరుక్కుపోయారు. రాజ్‌భవన్‌లో ఆయన లిఫ్టులో ఉండగా విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో మూడు నిమిషాల పాటు ఆయన లిఫ్టులోనే ఉండిపోయారు.
అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్ జేపీ రాజ్‌ఖోవా లిఫ్టులో ఇరుక్కుపోయారు. రాజ్‌భవన్‌లో ఆయన లిఫ్టులో ఉండగా విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో మూడు నిమిషాల పాటు ఆయన లిఫ్టులోనే ఉండిపోయారు. ఈ ఘటనతో తీవ్ర ఆగ్రహానికి గురైన గవర్నర్.. విద్యుత్ శాఖ అధికారులను పిలిపించి చీవాట్లు పెట్టారు. గవర్నర్ లిఫ్టులో ఉన్న సమయంలో అందులో కనీసం లైటు, ఫ్యాన్ కూడా పనిచేయలేదని, దాంతో ఆయన ఉక్కిరిబిక్కిరి అయ్యారని రాజ్‌భవన్ ఓ ప్రకటనలో తెలిపింది. ఆయనతోపాటు ఉన్న వ్యక్తిగత భద్రతాధికారి వెంటనే అత్యవసర కాల్స్ చేయడంతో.. ఆ తర్వాత విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు.
సాక్షాత్తు గవర్నర్‌కే ఇలాంటి సమస్య వస్తే.. ఇక సామాన్యుల గతేంటని మండిపడుతున్నారు. సోమవారం ఈ ఘటన జరగడంతో మంగళవారం నాడు గవర్నర్ రాజ్‌ఖోవా విద్యుత్ శాఖాధికారులను పిలిపించి, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో విద్యుత్ సరఫరా అస్తవ్యస్తంగా ఎందుకు ఉందని ప్రశ్నించి, ఈ పరిస్థితిని మెరుగుపరిచేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.