మోదీజీ.. కాస్త సాయం చేయండి: కేజ్రీవాల్ | Arvind Kejriwal seeks Narendra Modi's help for odd-even plan | Sakshi
Sakshi News home page

మోదీజీ.. కాస్త సాయం చేయండి: కేజ్రీవాల్

Published Mon, Dec 21 2015 6:18 PM | Last Updated on Wed, Aug 15 2018 2:20 PM

మోదీజీ.. కాస్త సాయం చేయండి: కేజ్రీవాల్ - Sakshi

మోదీజీ.. కాస్త సాయం చేయండి: కేజ్రీవాల్

అదేంటి, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ప్రధాని నరేంద్రమోదీకి మధ్య ప్రస్తుతం వ్యవహారం ఉప్పు-నిప్పు అన్నట్లుంది కదా, ఈయన ఆయన్ని సాయం కోరడం ఏంటని అనుకుంటున్నారా? దేశ రాజధాని నగరంలో కాలుష్యాన్ని అరికట్టేందుకు తలపెట్టిన సరి-బేసి కార్ల ఫార్ములా అమలు విషయంలో తమకు సాయం చేయాలని కేజ్రీవాల్ అడిగారట. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఆయనో లేఖ రాశారు.

కేంద్ర మంత్రివర్గంలోని మంత్రులు, అన్ని శాఖలకు చెందిన కార్యదర్శులు, ఇతర ఉన్నతాధికారులు కూడా రాజధానిలో కాలుష్యాన్ని అరికట్టేందుకు చేపట్టిన ఈ చర్యకు సహకరించేలా వారికి తగిన సూచనలు ఇవ్వాలని కేజ్రీవాల్ కోరారు. ప్రధాని స్వయంగా చెబితేనే జనవరి 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ప్రయోగాత్మకంగా చేపడుతున్న ఈ ప్రణాళిక విజయవంతం అవుతుందని ఆయన అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement