ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తో మీకు మాట్లాడాలని ఉందా.. మీ ఆలోచనలు అభిప్రాయాలు ఆయనకు చెప్పాలని ఉందా.. అయితే మరేం పర్వాలేదు.
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తో మీకు మాట్లాడాలని ఉందా.. మీ ఆలోచనలు అభిప్రాయాలు ఆయనకు చెప్పాలని ఉందా.. అయితే మరేం పర్వాలేదు. ఈ రోజు ఉదయం 11గంటలకు సిద్ధంగా ఉండండి. అందరితో ఆయన మాట్లాడతారు. అదే అనుకుంటున్నారా. ప్రధాని నరేంద్రమోదీ మన్ కీ బాత్ కార్యక్రమం మాదిరిగానే అరవింద్ కేజ్రీవాల్ కూడా 'టాక్ టు ఏకే' అనే ఓ కార్యక్రమాన్ని ఆదివారం ప్రారంభించనున్నారు.
మోదీ కేవలం ఆయన మాత్రమే మాట్లాడి తన సందేశాన్ని ఇస్తుండగా కేజ్రీవాల్ మాత్రం ముఖాముఖి టైపులో ప్రజలతో మాట్లాడనున్నారు. ఫోన్ చేయడం ద్వారా, మెస్సేజ్ చేయడం ద్వారా, సోషల్ మీడియాతో ప్రశ్నించడం ద్వారా కేజ్రీతో మాట్లాడే అవకాశ దక్కనుంది. త్వరలో గోవా, గుజరాత్, పంజాబ్ వంటి రాష్ట్రాల్లో ఎన్నికలు రానున్న నేపథ్యంలో ఈ కార్యక్రమం ఆమ్ ఆద్మీ పార్టీకి బాగా కలిసి వస్తుందని భావిస్తున్నారు. టాక్టుఏకేడాట్ కామ్(talktoak.com) అనే ప్రత్యేక వెబ్ సైట్ ను కూడా ప్రారంభించనున్నారు. దీనితో నేరుగా కేజ్రీవాల్ ను ప్రశ్నించడంతోపాటు 011-23392999 నెంబర్ కు ఫక్షన్ చేయడం ద్వారా కూడా కేజ్రీతో మాట్లాడవచ్చు. ప్రజల నుంచి మంచి మద్దతు ఉంటే ప్రతి నెల ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.