
అశోక్ గెహ్లాట్‌కు స్వైన్‌ఫ్లూ
జైపూర్: రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లట్‌కు స్వైన్‌ఫ్లూ సోకింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్వీటర్‌లో పేర్కొన్నారు. ‘‘నేను స్వైన్‌ఫ్లూ పరీక్షలు చేయించుకుంటే పాజిటివ్ అని తేలింది. కాని సరైన సమయంలో చికిత్స చేయించుకోవడంతో ఇప్పుడు బాగా ఉన్నాన’ని ఆయన ట్వీట్ చేశారు. అశోక్ గెహ్లాట్ గత మూరు రోజులుగా జ్వరంతో బాధ పడుతున్నారు. జనవరి 30న ఢిల్లీలో కాంగ్రెస్ తరుఫున ప్రచారంలో పాల్గొని తిరిగి వచ్చిన తర్వాత జ్వరం, దగ్గు బారిన పడ్డారు.