
న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా కరోనా ఉధృతి కోనసాగుతుంది. ఇప్పటికే పలువురు రాజకీయ ప్రముఖలు కరోనా బారినపడ్డారు. పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కోవిడ్ సోకింది. తాజాగా రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ట్విటర్ వేదికగా వెల్లడించారు. కాగా గహ్లోత్ గత కొన్ని రోజులుగా కోవిడ్ పరిస్థితిపై అధికారులతో సమావేశాలు నిర్వహించడంతో కోవిడ్ సోకినట్లు తెలుస్తోంది.
అయితే తాను ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నట్లు తెలిపారు. గహ్లోత్‌తోపాటు ఆయన సతీమణికి కూడా కరోనా సోకింది. అయితే వైద్యుల సూచనల మేరకు.. సీఎం అశోక్ గహ్లోత్ హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నట్లు పేర్కొన్నారు. ఇటీవల తనను కలిసిన వారందరూ.. కరోనా నిర్ధారణ పరీక్ష చేయించుకోవాల్సిందిగా ఆయన కోరారు.
कोविड टेस्ट करवाने पर आज मेरी रिपोर्ट भी पॉजिटिव आई है। मुझे किसी तरह के लक्षण नहीं हैं और मैं ठीक महसूस कर रहा हूं। कोविड प्रोटोकॉल का पालन करते हुए मैं आइसोलेशन में रहकर ही कार्य जारी रखूंगा।
— Ashok Gehlot (@ashokgehlot51) April 29, 2021