
ఫుడ్‌పాయిజన్.. 60 మంది ఆసుపత్రి పాలు
భరత్‌పూర్: ఓ వేడుకలో విందు భోజనం వికటించి 60 మంది ఆసుపత్రి పాలైన ఘటన రాజస్థాన్‌లో చోటు చేసుకుంది. భరత్‌పూర్ జిల్లా సర్‌సైనా గ్రామంలో శుక్రవారం రాత్రి విందు భోజనం చేసినవారు వాంతులు, ఇతర ఆరోగ్య సమస్యలను ఎదుర్కొన్నారు.
బాధితులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చేరిన వారిలో 13 మంది చిన్నారులు ఉన్నట్లు సమాచారం. ఫుడ్ పాయిజన్‌కు గల కారణాలు తెలియరాలేదు. ఈ ఘటనపై విచారణ జరుగుతోంది.