రశ్మిపై దాడి ఘటనపై విచారణకు సీఎం ఆదేశం
బెంగళూరు: మైసూరులోని అడ్మినిస్ట్రేషన్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ (ఏటిఐ)డెరైక్టర్ జనరల్ రశ్మిపై జరిగిన దాడి ఘటనపై సమగ్ర దర్యాప్తునకు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గురువారం ఆదేశించారు. మెస్ మేనేజర్ వెంకటేష్ మరణానికి ఐఏఎస్ అధికారి రశ్మి కారణం అని ఆరోపిస్తూ కుటుంబ సభ్యులు పలువురు బుధవారం ఆమెపై రాళ్లు రువ్వారు. చెప్పులతో దాడి చేశారు. ఈ విషయమై స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఇరు వర్గాలపై కేసులు నమోదయ్యాయి.
సంప్‌లోని నీటి పరిమాణాన్ని పరిశీలించేందుకు వెళ్లిన వెంకటేష్ ప్రమాదవశాత్తు అందులో పడి చనిపోయారు. అయితే సీనియర్ ఐఏఎస్ అధికారిణి రశ్మి వేధింపుల వల్లే తన తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడని వెంకటేష్ కొడుకు ఆరోపించాడు. ఈ ఘటనకు సంబంధించి 16 మందిని బుధవారం పోలీసులు అరెస్ట్ చేశారు.
**