అగస్టా తీర్పులో ‘కాగ్’ | Augusta in judgment 'CAG' | Sakshi
Sakshi News home page

అగస్టా తీర్పులో ‘కాగ్’

Published Sat, Apr 30 2016 1:35 AM | Last Updated on Sat, Sep 22 2018 8:48 PM

అగస్టా తీర్పులో ‘కాగ్’ - Sakshi

అగస్టా తీర్పులో ‘కాగ్’

న్యూఢిల్లీ: అగస్టావెస్ట్‌ల్యాండ్ స్కాంకు సంబంధించి.. ఇటలీ కోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పులో భారత కంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్ (కాగ్) తన నివేదికలో  పేర్కొన్న అనుమానాలనూ ఆధారంగా తీసుకుంది. అగస్టా మాతృసంస్థ ఫిన్‌మెకానికా అధిపతిని కోర్టు గత నెల దోషిగా ప్రకటించడం తెలిసిందే. 2013లో కాగ్ వినోద్‌రాయ్ ఇచ్చిన నివేదికలో.. ప్రభుత్వానికి అవసరమైన హెలికాప్టర్లు 19వేల అడుగుల ఎత్తులో ఎగరగలిగాలని రక్షణ శాఖ తొలుత నిర్ణయించిందని.. దాని ప్రకారం అగస్టా సంస్థకు అర్హత ఉండదని పేర్కొంది.

ఆ సంస్థ హెలికాప్టర్లు ఎగరగలిగే ఎత్తు 15 వేల అడుగుల వరకే ఉందని తెలిపింది. అయితే.. పర్వతమయమైన ఉత్తర, ఈశాన్య ప్రాంతాల్లో విహరించేందుకోసం కొనాల్సిన హెలికాప్టర్లు ఎగరగలిగే ఎత్తు పరిమితిని తగ్గించారంది. కాగ్ పేర్కొన్న ఈ అంశాలను.. అప్పటి భారత వైమానిక దళ చీఫ్ త్యాగి అగస్టా సంస్థతో కుమ్మక్కయ్యారనేందుకు ఆధారాల్లో ఒకటి అని ఇటలీ కోర్టు ఉటంకించింది. హెలికాప్టర్లు ఎంతవరకూ ఎగరగలగాలి అనే సమాచారం ఆయనకు ముందస్తుగా తెలుసంది.

 త్యాగి, గుజ్రాల్‌లను మళ్లీ ప్రశ్నించనున్న సీబీఐ: ఈ స్కాంలో వైమానిక దళ మాజీ అధిపతి ఎయిర్ చీఫ్ ఎస్.పి.త్యాగి, మాజీ డిప్యూటీ ఎయిర్ చీఫ్ జె.ఎస్.గుజ్రాల్‌లను సీబీఐ మళ్లీ ప్రశ్నించనుంది. గుజ్రాల్‌ను శనివారం, త్యాగిని సోమవారం సీబీఐ ఎదుట హాజరు కావాల్సిందిగా వారికి తెలిపినట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement