134 ఏళ్ల వివాదం .. 2019లో ముగింపు | Ayodhya Verdict : Chronology Over Centuries Dispute | Sakshi
Sakshi News home page

134 ఏళ్ల వివాదం .. 2019లో ముగింపు

Published Sat, Nov 9 2019 2:41 PM | Last Updated on Sat, Nov 9 2019 3:31 PM

Ayodhya Verdict : Chronology Over Centuries Dispute - Sakshi

న్యూఢిల్లీ : అయోధ్యలో వివాదాస్పదంగా మారిన 2.77 ఎకరాల భూమి హిందువులకే చెందుతుందని శనివారం సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. చీఫ్‌ జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఏకగ్రీవంగా ఈ తీర్పు వెలువరించింది. రామ మందిర నిర్మాణం కోసం మూడు నెలల్లో అయోధ్య ట్రస్ట్‌ ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని ఆదేశించిండంతో పాటుగా... మసీదు నిర్మాణానికి అయోధ్యలోనే సున్నీ వక్ఫ్‌ బోర్డుకు 5 ఎకరాల స్థలం కేటాయించాలని స్పష్టం చేసింది. దీంతో సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న ఈ వివాదానికి తెరపడింది.

ఈ నేపథ్యంలో శతాబ్దాల నాటి అయోధ్య-బాబ్రీమసీదు వివరాలు..

  • 1528: మొఘల్‌ చక్రవర్తి బాబర్‌ కాలంలో సైన్యాధిపతి మీర్‌ బకి వివాదాస్పద అయోధ్య ప్రాంతంలో బాబ్రీ మసీదు నిర్మించాడనేది వాదన.
  • 1885 : మహంత్‌ రఘుబర్‌దాస్‌ వివాదాస్పద అయోధ్య స్థలంలో పందిరి నిర్మించేందుకు అనుమతించాలని ఫైజాబాద్‌ కోర్టులో అభ్యర్థన.. కోర్టు తిరస్కరణ.
  • 1949 : వివాదాస్పద స్థలంలో రాముడి విగ్రహాలు ఏర్పాటు.
  • 1950 : వివాదాస్పద స్థలంలోని రాముడి విగ్రహారాధనకు అనుమతించాలని గోపాల్‌ సిమ్లా విశారద్‌ ఫైజాబాద్‌ కోర్టులో అప్పీల్‌. కోర్టు అనుమతి
  • -రాముడి విగ్రహారాధనకు అనుమతి కొనసాగించాలని, విగ్రహాలను తరలించరాదని రామచంద్ర పరమహంస కోర్టుకు వినతి. 
  • 1959 : వివాదదాస్పద స్థలంపై హక్కుల స్వాధీనం కోరుతూ నిర్మొహి అఖారా కోర్టులో పిటిషన్‌
  • 1961: వివాదదాస్పద స్థలంపై హక్కులు స్వాధీనం కోరుతూ సున్నీ సెంట్రల్‌ వక్ఫ్‌ బోర్డు కోర్టులో పిటిషన్‌
  • 1986: ఫిబ్రవరి 1 : హిందువులు వివాదాస్పద స్థలంలోని దేవతా విగ్రహాలకు పూజలకు స్థానిక కోర్టు అనుమతి
  • 1989, ఆగస్టు 14 : వివాదాస్పద స్థలంలో యధాతథ స్థితిని కొనసాగించాలని అలహాబాద్‌ హైకోర్టు ఆదేశం
  • 1992, డిసెంబర్‌ 6 : బాబ్రీ మసీదు కూల్చివేత.
  • 1993, ఏప్రిల్‌ 3 : వివాదాస్పద స్థలాన్ని అధీనంలోకి తీసుకోవడానికి చట్టం తెచ్చిన కేంద్ర ప్రభుత్వం
  • -కేంద్రం నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ అలహాబాద్‌ హైకోర్టులో ఇస్మాయిల్‌ ఫారుఖీ వంటివారు రిట్‌ పిటిషన్లు దాఖలు.
  • -హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న రిట్‌ పిటీషన్లను విచారించేందుకు సుప్రీంకోర్టు నిర్ణయం.
  • 1994, అక్టోబర్‌ 24: ఇస్మాయిల్ ఫారుఖీ కేసులో.. మసీదు ఇస్లాంలో భాగం కాదని తేల్చిచెప్ని సుప్రీంకోర్టు
  • 2002 ఏప్రిల్‌ : వివాదాస్పద స్థలం ఎవరికి చెందుతుంతో తేల్చేందుకు వాదనలు ప్రారంభించిన సుప్రీం కోర్టు
  • 2004, మార్చి 13 : వివాదాస్పద స్థలంలో ఏ మతస్తులు పూజలు, పార్థనలు చేయరాదని సుప్రీంకోర్టు ఆదేశం
  • 2010 సెప్టెంబర్‌ 30 : వివాదాస్పద భూమిని సున్నీ వక్ఫ్‌ బోర్డు, నిర్మోహి అఖార, రామ్‌ లల్లాకు సమానంగా పంచాలని అలహాబాద్‌ హైకోర్టు తీర్పు.
  • 2011, మే 9 : అలహాబాద్‌ హైకోర్టు తీర్పుపై స్టే విధించిన సుప్రీంకోర్టు
  • 2017 మార్చి 21 : అయోధ్య వివాదాన్ని కోర్టు బయట పరిష్కంచుకోవాలని సూచించిన సీజేఐ జేఎస్‌ ఖేహర్‌
  • 2018 సెప్టెంబర్‌ 27 : ఐదురుగు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి కేసును రిఫర్‌ చేయడానికి నిరాకరించిన సుప్రీం కోర్టు. ముగ్గురు సభ్యుల బెంచ్‌కు రిఫర్‌
  • 2019 జనవరి 8 : ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేసిన సుప్రీం కోర్టు. సీజేఐ రంజన్‌ గొగోయ్‌ నేత్వత్వంలో.. జస్టిస్‌ ఎస్‌ఏ బాబ్డే, ఎన్వీ రమణ, యూ.యూ లలిత్‌, డీవై చంద్రచూడ్‌ సభ్యులుగా ఏర్పాటు
  • 2019 జనవరి 10 : బెంచ్‌లో కొనసాగేందుకు యూ.యూ.లలిత్‌ నిరాకరణ. జనవరి 25న కొత్త బెంచ్‌ ఏర్పాటు. సీజేఐ రంజన్‌ గొగోయ్‌ నేత్వత్వంలో.. జస్టిస్‌ ఎస్‌ఏ బాబ్డే, డీవై చంద్రచూడ్‌, అశోక్‌ భూషణ్‌, ఎస్‌ఏ నజీర్‌సభ్యులుగా ఏర్పాటు.
  • జనవరి 29 : వివాదాస్పద స్థలం చుట్టూ ఉన్న 67 ఎకరాల భూ యజమానుల్ని గుర్తించాలని సుప్రీంకోర్టుని కోరిన కేంద్రం.
  • ఫిబ్రవరి 26 : మధ్యవర్తిత్వానికి ఓకే చెప్పిన అత్యున్నత న్యాయస్థానం. 
  • మార్చి 8 : సుప్రీంకోర్టు జడ్జి నేత్వత్వంలో ముగ్గురు సభ్యులతో మధ్యవర్తిత్వ కమిటీ ఏర్పాటు. న్యాయవాది శ్రీరామ్‌ పంచు, ఆధ్యాత్మిక వేత్త శ్రీశ్రీ రవిశంకర్‌ సభ్యులు. 
  • ఆగస్టు 2019 : మధ్యవర్తిత్వ కమిటీతో ప్రయోజనం లేకపోవడంతో అయోధ్య వివాదంపై సుప్రీంకోర్టు రోజువారీ విచారణను ప్రారంభించింది.
  • అక్టోబర్‌ 4 : నవంబర్‌17 లోపున తుది తీర్పు వెల్లడిస్తామని రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం
  • అక్టోబర్‌ 16 : వాదనలు ముగించిన అత్యున్నత న్యాయస్థానం.. తీర్పును రిజర్వులో ఉంచింది.
  • నవంబంర్‌ 9 : అయోధ్యలోని వివాదాస్పద భూమి (2.77) ఎకరాలు హిందువులకే చెందుతుందని సుప్రీం సంచలన తీర్పు వెలువరించింది. ప్రత్యామ్నాయంగా మసీదు నిర్మాణానికి అయోధ్యలోనే సున్నీవక్ఫ్‌ బోర్డుకు 5 ఎకరాల స్థలం ఇవ్వాలని ఆదేశించింది. మూడు నెలల్లో అయోధ్య ట్రస్ట్‌ ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీచేసింది. సుప్రీం కోర్టు నిర్ణయాన్ని అన్ని వర్గాలు ఆమోదిస్తున్నట్టు తెలిపాయి.  దీంతో 134 ఏళ్ల వివాదానికి తెరపడింది.

(చదవండి : అయోధ్య వివాదం​; కీలక తీర్పు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement