కాలేజీ ఎదురుగానే బీఈడీ విద్యార్థినిపై దారుణం! | B Ed student was found shot dead | Sakshi
Sakshi News home page

కాలేజీ ఎదురుగానే బీఈడీ విద్యార్థినిపై దారుణం!

Published Thu, May 5 2016 2:58 PM | Last Updated on Sun, Sep 3 2017 11:28 PM

కాలేజీ ఎదురుగానే బీఈడీ విద్యార్థినిపై దారుణం!

కాలేజీ ఎదురుగానే బీఈడీ విద్యార్థినిపై దారుణం!

రామ్‌గఢ్‌: తాను చదువుతున్న కాలేజీ ఎదురుగానే 31 ఏళ్ల బీఈడీ విద్యార్థిని దారుణంగా హత్యకు గురైంది. ఆమె చేతిని నరికేసి.. తుపాకీతో కాల్చిచంపారు. ఈ అమానుష ఘటన జార్ఖండ్‌లోని రామ్‌గఢ్‌లో బుధవారం చోటుచేసుకుంది.

వివాహిత అయిన సోనాలి మర్ము రామ్‌గఢ్‌లోని ఓ కాలేజీలో బీఈడీ చదువుతున్నది. ఆమెను ప్రేమిస్తున్నానని సుకేన్ మండల్‌ అనే వ్యక్తి నిత్యం వేధించేవాడు. ఆమెకు పెళ్లయినా కానీ అతడు వెంటాడటం మానలేదు. అయినా తనను సోనాలి కన్నెత్తయినా చూడకపోవడంతో ఇటీవల ఆమెను బెదిరించడం మొదలుపెట్టాడు. తాను ప్రేమిస్తున్నా.. తనను పట్టించుకోలేదన్న కోపంతో సుకేన్ మండల్‌ సోనాలిని చంపినట్టు కనిపిస్తున్నదని రామ్‌గఢ్ ఎస్పీ ఎం తమిళ్‌వనన్‌ తెలిపారు.

దుమ్కా ప్రాంతానికి చెందిన నిందితుడు సుకేన్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. రోజూ సోనాలిని భర్త తన మోటారు బైకుపై కాలేజీ వద్ద దిగబెట్టి వచ్చేవాడని, కానీ బుధవారం సోదరుడి బండి మీద ఆమెకు కాలేజీకి వెళ్లిందని, కాలేజీ నుంచి తిరిగొచ్చేలోపే ఇంతటి దారుణం జరిగిందని కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement