Ramgarh
-
ఇది పోలింగ్ బూతే
నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో ఎన్నికల నిర్వహణ అత్యంత కష్టతరమైన పని. అందులోనూ అత్యంత వెనుకబడిన, కనీస రవాణా సదుపాయాలు లేని ప్రాంతాల్లో ఎన్నికల నిర్వహణ అతి కష్టం. అలాంటి కోవలోదే జార్ఖండ్‌లోని హజారీబాగ్. హజారీబాగ్ నియోజకవర్గంలో అధిక సంఖ్యలో ఉన్న ఆదివాసీలతో ఓట్లు వేయించేందుకు స్థానిక ఎన్నికల నిర్వహణాధికారులు ముçప్పుతిప్పలు పడుతున్నారు. రెక్కాడితేగానీ డొక్కాడని ప్రజలు వారు. అభివృద్ధి వారి గూడేల్లోకి అడుగిడే పరిస్థితులే లేవు సరికదా జార్ఖండ్‌లోని కొన్ని ప్రాంతాల్లో మావోయి స్టుల ప్రాబల్యం ప్రబలంగా ఉంది. ఎలాగైనా పోలింగ్ శాతాన్ని పెంచడం కోసం ఆదివాసీలను ఆకట్టుకునే ప్రయత్నం మొదలుపెట్టారు ఎన్నికల నిర్వాహకులు. కొండకోనల్లో ఉండే గిరిజనులను రప్పించేందుకు ఓ సరికొత్త ఎత్తుగడ వేశారు. గతంలో స్థానిక ఆదివాసీ ప్రజల్లో అత్యధిక మంది రైలు ఎక్కడం కాదు కనీసం చూడను కూడా చూసి ఉండర ని తెలిసుకున్నారు. అంతే రైలు బోగీ ఆకారంలో పోలింగ్ బూత్‌ని ఏర్పాటు చేసి, దానికి 140 నంబర్ ఇచ్చారు. దానికి తోడు రైలు బూత్ గురించి గిరిజన గూడేల్లో విస్తృతంగా ప్రచారం కూడా జరిగింది. ఎన్నికల అధికారులు ఊహించినట్టుగానే నిజమైన రైలుని చూడని ఆదివాసీలు రైలు బూత్‌ని చూడ్డం కోసం వచ్చి, ఎంచక్కా రైలెక్కి తమ ప్రజాస్వామిక హక్కు అయిన ఓటు హక్కుని వినియోగించుకుని వెళ్ళిపోయారు. టికెట్టు లేకుండా రైలెక్కినట్టూ అయ్యింది. అధికారులకు ఆశించిన ఓటుని వినియోగించుకోవడమూ జరిగింది. బూత్‌నంబర్ 140 జార్ఖండ్‌లోని హజారీబాగ్ నియోజకవర్గం పరిధిలోని రామ్‌గఢ్ బ్లాక్లోనిది. -
రాజస్థాన్‌లో కాంగ్రెస్ జయభేరి
జైపూర్/ చండీగఢ్ : రాజస్థాన్‌లో అధికార కాంగ్రెస్ పార్టీ మరోసారి జయభేరి మోగించింది. రామ్‌గఢ్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి షఫియా జుబేర్ 12వేల ఓట్ల మెజారిటీతో గురువారం విజయం సాధించారు. జుబేర్‌కు 83,311 ఓట్లు రాగా.. సమీప భాజపా అభ్యర్థి సువంత్ సింగ్‌కు 71,083 ఓట్లు వచ్చాయి. ఈ విజయంతో 200 శాసనసభ స్థానాలున్న రాజస్థాన్ అసెంబ్లీలో కాంగ్రెస్ సంఖ్యాబలం 100కు పెరిగింది. గతేడాది డిసెంబరు 7న రాజస్థాన్ శాసనసభ ఎన్నికలు జరిగాయి. అయితే అప్పుడు రామ్‌గఢ్‌లో బీఎస్పీ అభ్యర్థి మృతితో ఆ నియోజకవర్గంలో ఎన్నిక వాయిదా వేసి తిరిగి జనవరి 27న ఎన్నికలు నిర్వహించారు. గురువారం ఓట్ల లెక్కింపు చేపట్టగా కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించారు. జింద్...మళ్లీ బీజేపీ వశం హరియాణాలో జరిగిన జింద్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలో అధికార బీజేపీ విజయకేతనం ఎగురవేసింది. అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగిన ఈ ఉప ఎన్నికలో ఆ పార్టీ అభ్యర్థి కృష్ణ మిద్దా గెలుపొందారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తన విజయానికి తోడ్పడిన కార్యకర్తలకు, పార్టీ శ్రేణులకు ధన్యవాదాలు తెలిపారు. కాగా ఐఎన్ఎల్డీ పార్టీకి చెందిన జింద్ సిట్టింగ్ ఎమ్మెల్యే హరిచంద్ మిద్దా మరణంతో అక్కడ ఉపఎన్నిక అనివార్యమైంది. ఈ నేపథ్యంలో ఆయన కుమారుడు కృష్ణ మిద్దా బీజేపీ తరపున బరిలో దిగారు. ఇక కాంగ్రెస్ నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సింగ్ సూర్జేవాలా, ఐఎన్ఎల్డీ నుంచి ఉమ్ సింగ్, కొత్తగా ఏర్పాటైన జేజేపీ నుంచి దిగ్విజయ్ చౌతాలా పోటీ చేశారు. -
హత్యల వెనుక పాక్ పాత్ర..!
శ్రీనగర్ : దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన జమ్మూ కశ్మీర్ జవాన్ల హత్య వెనుక బయంకరమైన వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. కశ్మీర్‌లోని రామ్‌గడ్ సెక్టార్‌తో పాటు.. సరిహద్దులో ముగ్గురు ప్రత్యేక ఎస్వీవోలను పాక్ ఉగ్రవాదులు దారుణంగా హతమార్చిన విషయం తెలిసిందే. కశ్మీర్లో జవాన్ల హత్యలను తీవ్రంగా భావించిన భారత నిఘా వర్గాలు దీని వెనుక పాకిస్తాన్ గుఢచారి సంస్థ ఐఎస్ఐ పాత్ర ఉన్నట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి. సైనికుల పేర్లను ఉగ్రవాదులకు చేరవేసి పక్కా ప్రణాళిక ప్రకారమే వారిని హతమార్చినట్లు ఐబీ వెల్లడించింది. ముందుగా వారిని విధుల నుంచి వైదొలగాల్సిందిగా ఉగ్రవాదులు హెచ్చరించారని అయినా కూడా జవాన్లు వారి బెదిరింపులకు లొంగకపోవడంతో కిడ్నాప్ చేసి అత్యంత కిరాతకంగా హత్యచేసినట్లు అధికారులు తెలిపారు. దీంతో పాకిస్తాన్ నైజాం మరోసారి బహిర్గతమైంది. సైనికుల హత్య వెనుక పాక్ హస్తం ఉన్నట్లు మొదటి నుంచి భావించిన భారత్.. ఐరాసలో జరిగే భారత్-పాక్ విదేశాంగ మంత్రుల సమావేశాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. పాక్ దుశ్చర్యపై దేశ వ్యాప్తంగా విమర్శలు వెలువెత్తుతున్నాయి. పాక్ తీరుకు ఖచ్చితంగా తూటాలతోనే సమాధానం చెప్తామని ఆర్మీ ప్రకటించింది. దీంతో సరిహద్దులో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పాక్ సరిహద్దులో భారత సైన్యం భారీగా సైన్యాన్ని మోహరించింది. ఈ నేపథ్యంలో పాక్‌తో జరగాల్సిన చర్చలను భారత్ రద్దు చేసుకోవడంతో పాకిస్తాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ తీవ్ర వ్యాఖ్యలతో భారత్‌పై విరుచుకుపడ్డారు. భారత్ అహంకారపూరితంగా వ్యవహరిస్తోందని.. తక్కువ స్థాయి కలిగిన వ్యక్తులు ఉన్నత స్థాయి పదవిలో ఉంటే ఇలానే ఉంటుందని మోదీపై ఇమ్రాన్ విషంగక్కారు. -
భారత జవాన్ గొంతు కోసిన పాక్ సైన్యం
జమ్మూ/న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీర్లో అంతర్జాతీయ సరిహద్దు వద్ద పాకిస్తానీ సైనికులు దారుణానికి తెగబడ్డారు. సరిహద్దు భద్రతా దళం(బీఎస్ఎఫ్)కు చెందిన ఓ జవానును తుపాకీతో కాల్చి, గొంతుకోసి చంపేశారు. జమ్మూ ప్రాంతంలోని రామ్‌గఢ్ సెక్టార్లో మంగళవారం ఈ ఘటన జరిగింది. బీఎస్ఎఫ్ విడుదల చేసిన ఓ ప్రకటన ప్రకారం.. రామ్‌గఢ్ సెక్టార్‌లోని సరిహద్దు కంచె వద్ద ఎత్తుగా పెరిగిన ఏనుగుల గడ్డిని కోసేందుకు బీఎస్ఎఫ్ జవాన్లు వెళ్లారు. సరిహద్దులు స్పష్టంగా కనిపించడం కోసం ఇలాంటి అడ్డుగా ఉన్న గడ్డిని జవాన్లు కోయడం సాధారణమే. జవాన్లు గడ్డి కోస్తుండగా పాక్ సైన్యం కాల్పులు జరిపింది. వెంటనే బీఎస్ఎఫ్ జవాన్లు కూడా ప్రతికాల్పులు జరిపి చాకచక్యంగా తప్పించుకుని వచ్చారు. అయితే హెడ్ కానిస్టేబుల్ నరేంద్ర సింగ్ కనిపించడం లేదన్న విషయాన్ని వారు ఆలస్యంగా గుర్తించారు. దీంతో ప్రధాన కార్యాలయం ఆదేశాల మేరకు ముందుగా గడ్డినంతటినీ కోసేసి తప్పిపోయిన నరేంద్ర సింగ్ కోసం వెతకడం ప్రారంభించారు. తమ జవాన్‌ను గుర్తించేందుకు సాయం చేయాల్సిందిగా పాకిస్తానీ సైనికులను కూడా భారత సైన్యం ఫోన్లో కోరింది. కొద్ది దూరం వరకే వచ్చి జవాన్‌ను వెతికిన పాక్ సైనికులు, ఆ తర్వాత నీళ్లు ఉన్నాయంటూ ఆగిపోయారని బీఎస్ఎఫ్ వెల్లడించింది. 9 గంటల గాలింపు తర్వాత బుల్లెట్ గాయాలతో పడిఉన్న నరేంద్ర సింగ్ మృతదేహం కనిపించిందనీ, అతని గొంతు కూడా కోసి ఉందని తెలిపింది. ‘జవాను శరీరంలో 3 బుల్లెట్లు ఉన్నాయి. అతని గొంతు కోశారు. ఇలాంటి ఆటవిక ఘటన అంతర్జాతీయ సరిహద్దులో ఎప్పుడూ చోటుచేసుకోలేదు. దీని వెనుక పాక్ సైనికులున్నారు. దీనికి బీఎస్ఎఫ్, ఇతర దళాలు తగిన సమాధానం చెబుతాయి’ అని బీఎస్ఎఫ్ అధికారులు చెప్పారు. -
నిందితులను సన్మానించిన కేంద్ర మంత్రి..!
సాక్షి, న్యూఢిల్లీ: గోవు మాంసం విక్రయిస్తున్నాడనే అనుమానంతో గతేడాది జూన్‌లో అలీముద్దీన్ అన్సారీ అనే వ్యక్తిని ఉరి వేసి చంపారు. రామ్‌ఘర్‌లోలో జరిగిన ఈ ఘటనలో 11 మందిని ముద్దాయిలుగా పేర్కొంటూ జార్ఖండ్‌లోని ఫాస్ట్ ట్రాక్ కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. ఆ తీర్పుకు హైకోర్టులో బ్రేకులు పడ్డాయి. విచారణ చేపట్టిన జార్ఖండ్ హైకోర్టు నిందితులందరికీ బెయిలు మంజూరు చేసింది. అయితే కోర్టు నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేసిన కేంద్ర మంత్రి జయంత్ సిన్హా హత్య కేసులోని 8 మంది నిందితులకు శుక్రవారం హజారీబాగ్‌లోని తన ఇంటిలో పూల మాలలు వేసి సన్మానం చేశారు. ఈ వ్యవహారంపై సోషల్ మీడియాలో సిన్హాపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉన్నత విద్యనభ్యసించిన జయంత్ తీరు మరీ అధ్వానంగా ఉందనీ జార్ఖండ్ ప్రతిపక్ష నేత హేమంత్ సోరెన్, కాంగ్రెస్ నాయకుడు అజోయ్ కుమార్‌లు మండిపడ్డారు. మత విద్వేశాల్ని రెచ్చగొట్టే హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి కేంద్ర మంత్రి మద్దతుగా నిలవడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. కాగా, ఈ విమర్శలపై జయంత్ సిన్హా శనివారం స్పందించారు. రాజకీయ పరిపక్వత లేనివారు తనను విమర్శిస్తున్నారని అన్నారు. భారతీయ న్యాయ వ్యవస్థపై తనకు నమ్మకముందనీ, హైకోర్టు తీర్పుపై ఆనందం వ్యక్తం చేయడం నేరం కాదని స్పష్టం చేశారు. సిన్హా హర్వార్డ్ బిజినెస్ స్కూల్లో పట్టభద్రులు కావడం గమనార్హం. -
బెయిల్‌పై నిందితులు.. మంత్రి ఘన స్వాగతం
రాంచీ : ఓ వైపు కేంద్రం నకిలీ వార్తలు, వదంతుల వల్ల దేశంలో పెరిగిపోతున్న హింసను తగ్గించేందుకు చర్యలు తీసుకుంటుంటే... మరోవైపు స్వయంగా అధికార పార్టీ నేతలే హింసాత్మక చర్యలకు పాల్పడిన వారికి ఘనస్వాగతం పలకడం వివాదాస్పదంగా మారింది. ఈ సంఘటన జార్ఖండ్‌లో చోటు చేసుకుంది. గో మాంసం అమ్ముతున్నాడనే నెపంతో ఓ ముస్లిం వ్యక్తిని చంపి జైలుకెళ్లి, ఆపై బెయిల్‌పై వచ్చిన వారికి పూలమాలలతో ఘనంగా స్వాగతం పలికారు బీజేపీ నేత, కేంద్ర మంత్రి జయంత్ సిన్హా. ఆ వివరాలిలా.. గో మాంసం అమ్ముతున్నాడనే నేపంతో గతేడాది జూన్ 29న జార్ఖండ్ రాంఘడ్‌కు చెందిన అలిముద్దిన్ అన్సారీ(40) అనే వ్యక్తిపై 12 మంది దాడి చేశారు. ఈ దాడిలో అన్సారీని తీవ్రంగా కొట్టడంతో అతను అక్కిడిక్కడే మృతి చెందాడు. ఈ దాడిలో పాల్గొన్న వారిలో 11 మందికి ఫాస్ట్‌ట్రాక్ కోర్టు మరణశిక్ష విధించింది. మరొకరు మైనర్ కావడంతో అతన్ని జువైనల్ హోంకు తరలించింది. శిక్ష పడిన వారిలో స్థానిక బీజేపీ నాయకుడు కూడా ఉన్నారు. అయితే కోర్టు తీర్పును జయంత్ సిన్హా వ్యతిరేకించారు. కేసును మరోసారి సమీక్షించాలని, సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో జార్ఖండ్ హైకోర్టు వీరిలో 8 మందికి బెయిల్ మంజూరు చేసింది. ఈ సందర్భంగా సిన్హా తన ఇంటి వద్ద వీరికోసం ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. బెయిల్ మీద వచ్చిన వారికి స్వయంగా ఎదురెళ్లి స్వాగతం పలకడమే కాక వారిని పూల మాలలతో సత్కరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో బీజేపీ ఎమ్మేల్యే శంకర్ చౌదరీ ‘మీ ఎనిమిది మంది తరుపున వాదించి, మీకు బెయిల్ వచ్చేలా చేసిన అడ్వకేట్ బీబీ త్రిపాథికి మీరు కృతజ్ఞతలు తెలపాలి. అతను మీ పాలిట దేవుడు’ అని వ్యాఖ్యానించారు. అయితే ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు మీడియాలో ప్రసారం కావడంతో ప్రతిపక్ష పార్టీలు బీజేపీని తీవ్రంగా విమర్శిస్తున్నాయి. ఇదిలా ఉండగా జయంత్ సిన్హా ఎన్నికైంది కూడా రాంఘడ్ నియోజక వర్గం నుంచే కావడం గమనార్హం. -
అరెవో సాంబ! షోలే థీమ్ పార్క్ ఎక్కడ?
బెంగళూరు: 1975లో విడుదలై దేశవ్యాప్తంగా సంచలనం సష్టించిన బాలీవుడ్ చిత్రం ‘షోలే’ గురించి తెలియని తరంగానీ, వినని తరంగానీ ఉండదేమో! అందులో ఏదో సీను, ఎప్పుడోసారి ప్రేక్షకుల మనోఫలకంపై ప్రతిఫలిస్తూనే ఉంటుంది. అందుకనే బెంగళూరు–మైసూర్ మధ్య పర్యటించే పర్యాటకులు షోలే సినిమా షూటింగ్ జరిగిన కర్ణాటకలోని రామనగర ప్రాంతాన్ని సందర్శిస్తారు. ‘అదిగో ఆ పర్వతంపైనే, అక్కడే గబ్బర్ సింగ్ గుర్రంపై వచ్చి ఠాకూర్ బల్దేవ్ సింగ్ భార్య, పిల్లల్ని కాల్చి చంపుతాడు. ఈ పక్కన బల్దేవ్ సింగ్ ఇల్లు సెట్టింగ్ ఉండేది. అదిగో అల్లంత దూరాన ఠాకూర్ రెండు చేతులు నరికేసిన గబ్బర్ సింగ్ డెన్’ అంటూ దారినపోయే దానయ్యలెందరో ఇక్కడికొచ్చిన పర్యాటకులకు చెబుతుంటారు. ఈ రామనగరాన్నే సినిమాలో రామ్‌గఢ్‌గా వ్యవహరించారు. ఈ ప్రాంతాన్ని ‘షోలే’ థీమ్‌తోనే ప్రముఖ పర్యాటక కేంద్రంగా అభివద్ధి చేసి సొమ్ము చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం చూస్తోంది. కానీ అటవి శాఖ మాత్రం అందుకు అనుమతించడం లేదు. షోలే షూటింగ్ జరిగిన ప్రాంతం కేంద్ర రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలోకి వస్తోందని, తాము ఎట్టి పరిస్థితుల్లో పర్యాటక ప్రాంతంగా అభివద్ధి చేసేందుకు అనుమతించమని ఆ శాఖ ఉన్నతాధికారులు తెలియజేస్తున్నారు. ఈ భూమంతా తమ రెవన్యూ శాఖ పరిధిలోనే ఉన్నందున షోలే థీమ్ పార్క్‌ను ఏర్పాటు చేస్తామని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ప్రియాంక్ ఖర్గే చెబుతున్నారు. ఇక్కడ షోలో సినిమాలో ఉన్నట్లుగానే గ్రామం సెట్టింగ్, గబ్బర్ సింగ్ గుడారాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా 120 ఎకరాల పరిధిలో ట్రెక్కింగ్, ఇతర సాహస క్రీడలను ప్రోత్సహించే సౌకర్యాలు, ఎంటర్టైన్మెంట్ పార్కులు ఉంటాయని ఆయన చెప్పారు. రాబందుల సంరక్షణ కేంద్రం దేశంలో నానాటికి అంతరించిపోతున్న రాబందులను సంరక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇక్కడే 2012లో 346 హెక్టార్లలో ఓ శాంక్చరీని ఏర్పాటు చేసింది. భారత్, నేపాల్, పాకిస్థాన్ దేశాల్లో కనిపించే లాంగ్ బిల్డ్ జాతితోపాటు ఈజిప్టు, వీపు తెలుపురంగులో ఉండే మరోజాతి రాబందులు ఇప్పుడు ఈ శాంక్చరీలో ఉన్నాయి. భారత దేశంలో లాంగ్ బిల్డ్ జాతి రాబందులు 97 శాతం, ఈజిప్టు జాతి రాబందులు 99 శాతం నశించి పోయిన నేపథ్యంలో కేంద్రం ఈ శాంక్చరీని ఏర్పాటు చేసింది. అభ్యంతరం పెడుతున్న పర్యావరణవేత్తలు షోలే థీమ్ పార్క్‌ను ఏర్పాటు చేయాలనే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనను పర్యావరణవేత్తలు, సామాజిక కార్యకర్తలు కూడా వ్యతిరేకిస్తున్నారు. ఈ ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా అభివద్ధి చేస్తే శాంక్చరీకి ముప్పు వాటిల్లుతుందని ఈ కేంద్రం ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన ప్రముఖ పర్యావరణవేత్త శివనంజయ్య తెలిపారు. గబ్బర్ సింగ్ గుహ వాస్తవానికి సాంక్చరీ లోపల ఉన్నప్పటికి అక్కడికి పర్యాటకులను అనుమతించమని, శాంక్చరీ సరిహద్దు నుంచే ఆ గుహ గురించి చెబుతామని, పైగా శాంక్చరీకి పది కిలోమీటర్ల ఇవతల నుంచి నిర్మించే షోలే థీమ్ పార్కులోనే గబ్బర్ గుహను ఏర్పాటు చేస్తామని పర్యాటక మంత్రి ఖర్గే చెబుతున్నారు. రాబందులవి చాలా సున్నితమైన జీవితాలని, వాటికి సరిహద్దులు గుర్తించే తెలివితేటలు కూడా లేవని శివనంజయ్య అంటున్నారు. ఇప్పటికే శాంక్చరీ లోపలున్న రామ మందిరాన్ని సందర్శించేందుకు భక్తులు రావడం, అప్పుడప్పుడు ఉత్సవాలు జరపడం వల్ల రాబందులకు ముప్పు వాటిల్లుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఏ ప్యాసేజ్ టూ ఇండియా’ కూడా ఇక్కడ తీసిందే ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు డేవిడ్లీన్ తీసిన ‘ఏ ప్యాసేజ్ టు ఇండియా’ చిత్రం కూడా ఇక్కడ తీసిందే. విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ చిత్రం షూటింగ్‌ను 1983–1984లో ఇక్కడ రామనగరలో నిర్వహించారు. అప్పడు ఇక్కడి పర్వతాలపై కొన్ని బండరాళ్లను బాంబులతో పగులగొట్టడం వల్ల పర్యావరణానికి ఎంతో నష్టం వాటిల్లిందని పర్యావరణ వేత్తలు ఆరోపిస్తున్నారు. ఇదే ప్రాంతంలో తొలిసారిగా 1966లో జాన్‌బెర్రీ తీసిన జంగిల్ అడ్వెంచర్ చిత్రం ‘మాయా’ షూటింగ్ జరిగింది. ఈ సినిమాకు ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేసిన రామ్ యెదేకర్ ఆ తర్వాత ‘షోలే’కు పనిచేశారు. యెదేకర్ సూచన మేరకే రమేష్ సిప్పీ షోలే షూటింగ్‌ను ఇక్కడ తీశారు. నాటి జ్ఞాపకాలు ఇప్పటికీ గుర్తున్నాయి షోలో షూటింగ్ నాటి జ్ఞాపకాలు తనకు ఇప్పటికీ గుర్తున్నాయని రాబందుల శాంక్చరీకి వాచ్‌మేన్‌గా పనిచేస్తున్న 60 ఏళ్ల వీరయ్య తెలిపారు. షూటింగ్ నాటికి 18 ఏళ్లు ఉన్న వీరయ్య ఆ సినిమాలో ఓ చిన్న పాత్రను కూడా పోషించారు. అవసరమైనప్పుడల్లా గబ్బర్ సింగ్‌కు తుపాకీ తెచ్చియ్యడమే తన పాత్రని, ప్రభుత్వం థీమ్ పార్క్‌ను అభివద్ధి చేస్తే తాను గైడ్‌గా పనిచేస్తానని వివాదంతో సంబంధంలేని వీరయ్య చెప్పారు. షోలో థీమ్ పార్క్ అభివద్ధికి రాష్ట్ర ప్రభుత్వం గతంలో చేసిన ప్రయత్నాలు కూడా వివాదాల కారణంగా ఫలించలేదు. ఈసారి ఎందుకో తమ ప్రయత్నాలు ఫలిస్తాయన్న ఆశతో ఉంది. -
కాలేజీ ఎదురుగానే బీఈడీ విద్యార్థినిపై దారుణం!
రామ్‌గఢ్: తాను చదువుతున్న కాలేజీ ఎదురుగానే 31 ఏళ్ల బీఈడీ విద్యార్థిని దారుణంగా హత్యకు గురైంది. ఆమె చేతిని నరికేసి.. తుపాకీతో కాల్చిచంపారు. ఈ అమానుష ఘటన జార్ఖండ్‌లోని రామ్‌గఢ్‌లో బుధవారం చోటుచేసుకుంది. వివాహిత అయిన సోనాలి మర్ము రామ్‌గఢ్‌లోని ఓ కాలేజీలో బీఈడీ చదువుతున్నది. ఆమెను ప్రేమిస్తున్నానని సుకేన్ మండల్ అనే వ్యక్తి నిత్యం వేధించేవాడు. ఆమెకు పెళ్లయినా కానీ అతడు వెంటాడటం మానలేదు. అయినా తనను సోనాలి కన్నెత్తయినా చూడకపోవడంతో ఇటీవల ఆమెను బెదిరించడం మొదలుపెట్టాడు. తాను ప్రేమిస్తున్నా.. తనను పట్టించుకోలేదన్న కోపంతో సుకేన్ మండల్ సోనాలిని చంపినట్టు కనిపిస్తున్నదని రామ్‌గఢ్ ఎస్పీ ఎం తమిళ్‌వనన్ తెలిపారు. దుమ్కా ప్రాంతానికి చెందిన నిందితుడు సుకేన్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. రోజూ సోనాలిని భర్త తన మోటారు బైకుపై కాలేజీ వద్ద దిగబెట్టి వచ్చేవాడని, కానీ బుధవారం సోదరుడి బండి మీద ఆమెకు కాలేజీకి వెళ్లిందని, కాలేజీ నుంచి తిరిగొచ్చేలోపే ఇంతటి దారుణం జరిగిందని కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.