బెలూన్లు, క్యాండిళ్లు, బైనాక్యులర్లపై నిషేధం!
బహిరంగ స్థలాల్లో బెలూన్లు, క్యాండిళ్లు, ఫ్లూటుల లాంటివాటిని వినియోగించడంపై నిషేధం ఉందన్న విషయం మీకు తెలుసా? అవును.. పోలింగ్ కేంద్రాలకు 100 మీటర్ల దూరంలో వాటిని ఉపయోగిస్తే ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించినట్లే అవుతుందట. ఏడు కిరణాలతో కూడిన పెన్ను పాళీ, బెలూన్, వజ్రం, బైనాక్యులర్లు, బ్యాట్, కొవ్వొత్తులు.. ఇలాంటివాటిని పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్థులకు గుర్తులుగా కేటాయించారు. దాంతో.. వీటన్నింటినీ పోలింగ్ కేంద్రాలకు ఎన్నికల కమిషన్ అధికారులు తెలిపారు.
ఎన్నికల రోజు, దానికి 48 గంటల తర్వాత పోలింగ్ కేంద్రానికి 100 మీటర్ల దూరంలో ప్రచారం చేయకూడదని, అక్కడ 144వ సెక్షన్ ప్రకారం నిషేధాజ్ఞలు అమలులో ఉన్నాయని ఎన్నికల డిప్యూటీ ప్రధానాధికారి అంజన్ ఘోష్ చెప్పారు. అయితే.. ఎవరైనా అభ్యర్థికి ఫ్యాన్ గుర్తు కేటాయించినా.. పోలింగ్ కేంద్రం లోపల ఫ్యాన్లు వేయకూడదన్న రూల్ మాత్రం ఉండబోదని తెలిపారు. ఏజెంట్లు అభ్యర్థుల ఎన్నికల గుర్తులను ప్రదర్శించకూడదని, ఐడెంటిటీ కార్డుమీద కూడా కేవలం పేరు మాత్రమే ఉండాలని వివరించారు.