బీహార్ పోలీసుల కాఠిన్యం... | Bihar Police Drags Body Hundreds Of Metres With Rope Around Neck | Sakshi
Sakshi News home page

బీహార్ పోలీసుల కాఠిన్యం...

Published Thu, Sep 15 2016 12:55 PM | Last Updated on Thu, Jul 18 2019 2:02 PM

బీహార్ పోలీసుల కాఠిన్యం... - Sakshi

బీహార్ పోలీసుల కాఠిన్యం...

వైశాలిః ఖాకీల కాఠిన్యం మరోమారు బయటపడింది. గ్వాలియర్ రైల్వే స్టేషన్ లో ఓ బాలుడి మెడకు టవల్ చుట్టి ఈడ్చుకెళ్ళిన రైల్వే కానిస్టేబుల్ ప్రతాపం మరువక ముందే... బీహార్ పోలీసుల అమానుషత్వం వెలుగులోకి వచ్చింది.

సీసీ ఫుటేజ్ ద్వారా బీహార్ పోలీసుల అమానుషత్వం బయట పడింది. ఓ మృత దేహం మెడకు తాడు కట్టి వందల మీటర్ల దూరం ఈడ్చుకెళ్ళిన ఘటన.. దిగ్భ్రాంతికి గురి చేసింది. బీహార్ వైశాలి జిల్లాలో గల గంగానదిలో తేలిన ఓ వ్యక్తి శవాన్ని గుర్తించిన గ్రామస్థులు... బాడీని బయటకు తీసి పోలీసులకు రిపోర్టు చేశారు. అయితే  పిలిచిన రెండు గంటల తర్వాత ఉత్త చేతుల్తో తీరిగ్గా వచ్చిన పోలీసులు.. అంబులెన్స్ గానీ, వర్కర్స్ ను గానీ వెంటబెట్టుకు రాకపోగా.. మృతదేహం మెడకు తాడు చుట్టి వందలమీటర్ల దూరంలో నిలిపిన వాహనం వరకూ ఈడ్చుకుంటూ వెళ్ళారు. సీసీ కెమెరాలో రికార్డయిన ఈ దారుణ దృశ్యాలను బట్టి వందలమంది చూస్తుండగానే ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.

వీడియో వివరాలు వైరల్ కావడంతో పై అధికారుల దృష్టికి వెళ్ళింది. దీంతో ఘటనకు కారణమైన ఇద్దరు పోలీసులను సస్పెండ్ చేశారు. ఇదే జిల్లాలో కొన్నేళ్ళక్రితం జరిగిన ఘటనలో కొందరు అల్లరిమూకల కారణంగా మృతి చెందిన పదిమందిని దహనం చేయాలని పేర్కొన్నా... పోలీసులు వారిని నదిలో విసిరేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అనంతరం సదరు అధికారులపై చర్యలు తీసుకున్నారు. ఇటువంటి ఘటనలెన్నో పోలీసుల కాఠిన్యానికి నిదర్శనంగా నిలవడంతోపాటు ప్రజలను దిగ్భ్రాంతికి గురి చేస్తున్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement