ఎమ్మెల్యే రాజ్ బల్లాబ్ యాదవ్(ఫైల్)
పాట్నా: సస్పెండెడ్ ఆర్జేడీ ఎమ్మెల్యే రాజ్ బల్లాబ్ యాదవ్ కుమారుడిని పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. తన తండ్రి ఎదుర్కొంటున్న అత్యాచారం కేసులో సాక్ష్యాలు నాశనం చేశారన్న ఆరోపణలతో అతడిని అదుపులోకి తీసుకున్నారు. మైనర్ బాలికను కిడ్నాప్ చేసి, అత్యాచారం చేసినట్టు కేసు నమోదు రావడంతో ఎమ్మెల్యే రాజ్ బల్లాబ్ యాదవ్ పై ఆర్జేడీ ఆయనపై సస్పెన్షన్ వేటు వేసింది. ఆయనకు షోకాజ్ నోటీసు కూడా జారీచేసింది.
ఈ నెల 6న మైనర్ బాలికపై ఆయన అత్యాచారానికి పాల్పడినట్టు కేసు నమోదైంది. విషయం బయటకు పొక్కకుండా ఉండేందుకు తనకు ఎమ్మెల్యే 30 వేల రూపాయలు ఇవ్వజూపినట్టు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. స్థానిక కోర్టు సోమవారం ఆయనకు అరెస్ట్ వారెంట్ ఇచ్చింది. పరారీలో ఉన్న యాదవ్ కోసం పోలీసులు గాలిస్తున్నాయి. ఇటీవల జరిగిన ఎన్నికల్లో నవాడా నియోజకవర్గం నుంచి యాదవ్ గెలిచారు. గతంలో ఆర్జేడీ ప్రభుత్వంలో ఆయన మంత్రిగా పనిచేశారు.