8 కోట్లు దాటిన బీజేపీ సభ్యత్వం | bjp membership crosses 8 crore margin | Sakshi
Sakshi News home page

8 కోట్లు దాటిన బీజేపీ సభ్యత్వం

Published Tue, Mar 24 2015 2:55 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

bjp membership crosses 8 crore margin

న్యూఢిల్లీ: తమ పార్టీ సభ్యత్వం ఎనిమిది కోట్లు దాటిందని, త్వరలో  ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా బీజేపీ ఆవిర్భవిస్తుందని ఆ పార్టీ  ప్రకటించింది. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా 8.51 కోట్ల సభ్యత్వంతో ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా ఉంది. ఈ నెల 31లోపు ఈ సంఖ్యను దాటి ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించాలని బీజేపీ లక్ష్యంగా నిర్దేశించుకుంది. బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా మాట్లాడుతూ సభ్యత్వ నమోదులో 8 కోట్ల మైలురాయిని దాటినందుకు కార్యకర్తలకు, సభ్యులకు అభినందనలు తెలిపారు. రాజస్థాన్‌లో 50 లక్షల సభ్యత్వం నమోదయ్యేలా కృషి చేసినందుకు ఆ రాష్ట్ర సీఎం వసుంధర రాజేను కూడా ఆయన అభినందించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement