ఆత్మ లేకుండా దేహం ఉంటుందా? | body can't stay without the soul, says Navjot Kaur Sidhu | Sakshi
Sakshi News home page

ఆత్మ లేకుండా దేహం ఉంటుందా?

Published Mon, Nov 28 2016 5:30 PM | Last Updated on Mon, Sep 4 2017 9:21 PM

ఆత్మ లేకుండా దేహం ఉంటుందా?

ఆత్మ లేకుండా దేహం ఉంటుందా?

న్యూఢిల్లీ: పంజాబ్‌కు చెందిన మాజీ క్రికెటర్‌ సిద్ధూ భార్య నవజ్యోత్‌ కౌర్‌ సోమవారం కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. కాంగ్రెస్‌  పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో కెప్టెన్‌ అమరీందర్ సింగ్‌ పార్టీ కండువాతో కౌర్‌ కు స్వాగతం పలికారు. మాజీ ఒలింపియన్‌, అకాలీదళ్‌ మాజీ ఎమ్మెల్యే ప్రగత్‌ సింగ్‌ కూడా కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.

కౌర్‌ భర్త నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూకు కూడా గాలం వేస్తున్నారా అని ఈ సందర్భంగా అమరీందర్‌ సింగ్‌ ను అడగ్గా... కౌర్‌ ఇక్కడ ఉంటే, సిద్ధూ ఆమె వెనుక నిలబడకుండా ఉండగలరా అని ఎదురు ప్రశ్నించారు. అమరీందర్‌ నుంచి కౌర్‌ మైకు తీసుకుని ‘మా దేహాలు వేరైనా ఆత్మ ఒక్కటే. ఆత్మ లేకుండా దేహం ఉండలేదు. సిద్ధూ కూడా కాంగ్రెస్‌ లో చేరతార’ని సమాధానం ఇచ్చారు.


ఈ మధ్యే బీజేపీ నుంచి బయటకు వచ్చిన సిద్ధూ ఆవాజ్‌–ఎ–పంజాబ్‌ పార్టీని స్థాపించడం తెలిసిందే. వచ్చే ఏడాది ఆరంభంలో జరగనున్న పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరపున సిద్ధూ ముఖ్య ప్రచారకుడిగా వ్యవహరిస్తారన్న వార్తలు కూడా వస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement