80 శాతం కాల్‌రేట్లు తగ్గించిన బీఎస్‌ఎన్‌ఎల్
♦ 80 శాతం మొబైల్ కాల్‌రేట్లు తగ్గింపు
♦ మొదటి రెండు నెలలు వరకే ఈ స్కీం వర్తింపు
♦ ఒక సెకన్, ఒక నిమిషం బిల్లింగ్ ప్లాన్‌లకు మాత్రమే
♦ రూ. 36 వోచర్తో రిచార్జ్.. సెకండ్ ప్లాన్ వర్తింపు
♦ రూ. 37 వోచర్తో రిచార్జ్.. నిమిషం ప్లాన్: బీఎస్‌ఎన్‌ఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అనుపామ్ శ్రీవాస్తవ
న్యూఢిల్లీ: బీఎస్‌ఎన్‌ఎల్ కొత్త వినియోగదారులకు శుభవార్త. కొత్త కనెక్షన్ తీసుకునే వినియోగదారులకు మొదటి రెండు నెలల స్కీం కింద 80 శాతం మొబైల్ కాల్‌రేట్లను తగ్గిస్తున్నట్టు బీఎస్‌ఎన్‌ఎల్ పేర్కొంది. ప్రస్తుత తరుణంలో మార్కెట్‌లో ఇతర నెట్‌వర్క్‌ల పోటీని దృష్టిలో ఉంచుకుని వినియోగదారులను ఆకర్షించే దిశగా బీఎస్‌ఎన్‌ఎల్ అడుగులు వేస్తోంది. అందులో భాగంగానే ఒక నిమిషం, ఒక సెకన్ బిల్లింగ్ ప్లాన్ వంటి కొత్త ఆపర్లతో వినియోగదారుల మందుకు వస్తోంది.
అయితే కొత్త కనెక్షన్ తీసుకునే వినియోగదారులు తొలుత రూ. 36 వోచర్( ఒక సెకన్ ప్లాన్)తో రిచార్జ్ చేసుకోవాల్సిందిగా సూచించింది. రూ. 37 తో రిచార్జ్ చేసుకున్నట్లయితే వారికి నిమిషానికి 10 పైసల చొప్పున చార్జ్ చేయబడుతుందని తెలిపింది. దీంతో కొత్త యూజర్లు తమ సర్వీసులను పునరుద్ధరించుకోవడానికి చక్కగా ఉంటుందని బీఎస్‌ఎన్‌ఎల్ సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అనుపామ్ శ్రీవాస్తవ పిటిఐకి తెలిపారు. కొత్త కనెక్షన్ తీసుకునే వినియోగదారులకు మొదటిసారి ఒక సెకన్ ప్లాన్ కోసం తొలుత రూ. 36 వోచర్, ఒక నిమిషం ప్లాన్ కోసం రూ. 37 వోచర్తో రిచార్జ్ చేసుకోవాలి.ఈ స్కీం (మొబైల్ నంబర్ పోర్టబులుటీ) వినియోగదారులు కూడా వర్తిస్తుందన్నారు.
అయితే రూ. 37 స్కీంలో ఉన్న వినియోగదారులకు లోకల్, ఎస్టీడీ కాల్స్ చేసుకుంటే నిమిషానికి 10 పైసలు చొప్పున చార్జ్ చేయబడుతుంది. మిగతా నెట్వర్క్‌లకు కాల్ చేస్తే నిమిషానికి 30 పైసలు చొప్పున చార్జ్ పడుతుంది. అదేవిధంగా రూ. 36 తో రిచార్జ్ చేసుకుంటే బీఎస్‌ఎన్‌ఎల్ లోకల్, ఎస్టీడీ కాల్స్‌కు ప్రతి మూడు సెకన్లకు ఒక పైసా చొప్పున చార్జ్ పడుతుంది. అలాగే ఇతర సర్వీసులకుగానూ ప్రతి మూడు సెకన్లకు 2 పైసల చొప్పున కాల్ చార్జీలు వర్తిస్తాయని శ్రీవాస్తవ పేర్కొన్నారు.