
రిజర్వేషన్ల అంశాన్ని బీజేపీ వాడుకుంటోంది
బీవీ రాఘవులు విమర్శ
సాక్షి, న్యూఢిల్లీ: ముస్లిం మైనారిటీల్లో వెనుకబడ్డ వర్గాలకు రిజర్వేషన్లు ఉండా లన్న డిమాండ్ చా లాకాలంగా ఉందని, తెలంగాణలో రిజర్వేషన్లలో మార్పులు చేయడం సమంజసమేనని సీపీఎం పొలి ట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు పేర్కొన్నారు.
ఆ పార్టీ కేంద్ర కమిటీ సమావేశాలు ఢిల్లీలో ప్రారంభమయ్యా యి.బీజేపీ మతోన్మాదాన్ని రెచ్చగొట్టేం దుకు మతప్రాదికన రిజర్వేషన్లు కల్పిస్తు న్నారన్న ప్రచారం చేస్తూ ఈ అంశాన్ని వాడుకుంటోందన్నారు. మొత్తం రిజర్వే షన్ల శాతం 50 శాతానికి మించితే కోర్టులో నిలబడదని, 50 శాతం రిజర్వేషన్ల సీలింగ్ తొలగించి రిజర్వేషన్ల శాతం పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని సూచించారు.