జవదేకర్, నిర్మలా సీతారామన్కు ప్రమోషన్? | Cabinet reshuffle: Prakash Javadekar, Nirmala Sitharaman may be promoted | Sakshi
Sakshi News home page

జవదేకర్, నిర్మలా సీతారామన్కు ప్రమోషన్?

Published Thu, Nov 6 2014 12:33 PM | Last Updated on Wed, Aug 15 2018 2:20 PM

జవదేకర్, నిర్మలా సీతారామన్కు ప్రమోషన్? - Sakshi

జవదేకర్, నిర్మలా సీతారామన్కు ప్రమోషన్?

న్యూఢిల్లీ :  కేంద్ర మంత్రివర్గ విస్తరణ నేపథ్యంలో ప్రకాష్ జవదేకర్, నిర్మలా సీతారామన్లకు ప్రమోషన్లు రావొచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. జవదేకర్తో పాటు నిర్మలా సీతారామన్లను మోదీ కేబినెట్లోకి తీసుకోనున్నట్లు సమాచారం.  కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రిగా నిర్మలా,  కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ సహాయ మంత్రిగా ప్రకాష్ జవదేకర్ బాధ్యతలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.

మోదీ వారణాసి పర్యటన అనంతరం నవంబర్ 7-11 తేదీల మధ్యలో మంత్రివర్గ విస్తరణకు తుదిరూపు ఇస్తారని ఢిల్లీ వర్గాల సమాచారం. రక్షణ మంత్రిగా గోవా ముఖ్యమంత్రి మనోహర్ పరికర్, బీజేపీ సీనియర్ నేత యశ్వంత్ సిన్హా కుమారుడు జయంత్ సిన్హా, చంద్రపూర్ బీజేపీ ఎంపీ హన్స్రాజ్ అహిర్లకు చోటు దక్కుతుందని ప్రచారం జరుగుతోంది. అలాగే ముక్తార్ అబ్బాస్ నఖ్వీ, రాజీవ్ ప్రతాప్ రూఢీలకు అవకాశం ఉంటుందని కథనాలు వెలువడుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement