మే 7న ‘నీట్‌’.. మార్చి 1న తుది గడువు | CBSE release notification for neet exam | Sakshi
Sakshi News home page

మే 7న ‘నీట్‌’.. మార్చి 1న తుది గడువు

Published Wed, Feb 1 2017 4:04 AM | Last Updated on Sat, Oct 20 2018 5:44 PM

CBSE release notification for neet exam

  • నోటిఫికేషన్‌ జారీ చేసిన సీబీఎస్‌ఈ
  • ఆన్‌లైన్‌లో దరఖాస్తుకు గడువు మార్చి 1
  • ఆధార్‌ నంబర్‌ తప్పనిసరి
  • సాక్షి, హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్‌ కాలేజీల్లో ఎంబీబీఎస్, బీడీఎస్‌ కోర్సుల్లో ప్రవేశానికి జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష (నీట్‌)–2017కు సీబీఎస్‌ఈ నోటిఫికేషన్‌ జారీ చేసింది. పరీక్ష మే 7న ఉంటుంది. ఎయిమ్స్, జిప్‌మర్‌ మినహా అన్ని మెడికల్‌ కాలేజీల్లో ప్రవేశానికి నీట్‌ నిర్వహిస్తున్నారు. పరీక్షకు జనవరి 31–మార్చి 1వ తేదీ మధ్య ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని సీబీఎస్‌ఈ వెల్లడించింది. ఆలిండియా కోటా సీట్లు, రాష్ట్ర ప్రభుత్వ కోటా సీట్లు, ప్రైవేటు మెడికల్‌ కాలేజీల్లోని మేనేజ్‌మెంట్‌/ఎన్‌ఆర్‌ఐ కోటా సీట్లు, డీమ్డ్‌ వర్సిటీలోని సీట్లు, సెంట్రల్‌ పూల్‌ కోటా సీట్లకు నీట్‌ ర్యాంకుల ద్వారానే అడ్మిషన్లు నిర్వహిస్తామని నీట్‌ డైరెక్టర్‌ వెల్లడించారు.

    దేశవ్యాప్తంగా 80 నగరాల్లో 1500 కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తారు. 15 శాతం ఆలిండియా కోటా సీట్లకు ప్రవాస భారతీయలు, విదేశీయులు కూడా నీట్‌ రాసుకోవడానికి వీలు కల్పించారు. నీట్‌ రాయడానికి 25 ఏళ్ల గరిష్ట వయోపరిమితి విధించారు. రిజర్వు అభ్యర్థులకు ఐదేళ్ల సడలింపు ఉంటుంది. ఎవరైనా మూడుసార్లకు మించి పరీక్ష రాయడానికి వీలు లేదు. మేఘాలయ, అస్సాం, జమ్మూ కశ్మీర్‌ మినహా మిగిగతా రాష్ట్రాల విద్యార్థులు తమ ఆన్‌లైన్‌ దరఖాస్తులో ఆధార్‌ నంబర్‌ను తప్పనిసరిగా నమోదు చేయాలి. మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (ఎంసీఐ) ఆదేశాల మేరకు నీట్‌–2017 ఆలిండియా ర్యాంకులను నీట్‌ తయారుచేయనుంది. పూర్తి వివరాలను నీట్‌ వెబ్‌సైట్‌ ‘ ఠీఠీఠీ. ఛిbట్ఛn్ఛ్ఛ్ట. nజీఛి. జీn’లో ఉంచారు. దేశంలోని అన్ని ఎంబీబీఎస్, బీడీఎస్‌ సీట్లకు నీట్‌ పరీక్ష నిర్వహించడం ఇదే తొలిసారి. 10 లక్షల మంది ఈసారి నీట్‌ రాస్తారని అంచనా.

    గతేడాది నీట్‌–1, నీట్‌–2లకు 8.02 లక్షల మంది హాజరయ్యారు. దరఖాస్తు చేసుకున్న ప్రతీ ఒక్కరికీ వ్యక్తిగత లాగిన్‌ ఐడీ ఏర్పాటు చేశారు. పరీక్ష ఫలితాలను ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖలోని హెల్త్‌ సర్వీసెస్‌ డైరెక్టరేట్‌ జనరల్‌కు అందజేస్తామని సీబీఎస్‌ఈ ప్రకటించింది. అనంతరం మెరిట్‌ లిస్టు ఆధారంగా అడ్మిషన్ల కోసం తిరిగి దరఖాస్తులను ఆహానిస్తారు. ఈసారి తెలంగాణలో కేవలం ఇంజినీరింగ్, వ్యవసాయ తదితర కోర్సులకే ఎంసెట్‌ నిర్వహిస్తారు. ఎంబీబీఎస్, బీడీఎస్‌ల్లో ప్రవేశాలకు విద్యార్థులు తప్పనిసరిగా నీట్‌ రాయాల్సి ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement