న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ మాజీ ఉద్యోగుల కనీస పింఛన్‌ను రూ.9 వేలు చేసినట్లు , ఎక్స్‌గ్రేషియాను రెండింతలు పెంచినట్లు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ గురువారం తెలిపారు. స్వచ్ఛంద సంస్థల స్థాయీ సంఘం(ఎస్‌సీఓవీఏ) 29వ సమావేశంలో ఆయన ప్రసంగించారు. దేశంలో సుమారు50–55 లక్షల పింఛనుదారులున్నారని, దాదాపు 88 శాతం పింఛన్ ఖాతాలను ఆధార్‌కు అనుసంధానించినట్లు వెల్లడించారు. కనీస పింఛన్‌ను రూ.9 వేలకు, ఎక్స్‌గ్రేషియాను 10–15 లక్షల నుంచి 25–30 లక్షలకు పెంచినట్లు సిబ్బంది వ్యవహారాల శాఖ ప్రకటన జారీచేసింది. పదవీ విరమణ పొందిన ఉద్యోగుల అనుభవం, నైపుణ్యాలను ఉపయోగించుకునేలా సంస్థాగత విధానం ఉండాలని మంత్రి అన్నారు.