మళ్లీ వెంకయ్యకే అవకాశం | chance again to venkaiah | Sakshi
Sakshi News home page

మళ్లీ వెంకయ్యకే అవకాశం

Published Mon, May 23 2016 12:35 AM | Last Updated on Thu, Mar 28 2019 8:37 PM

మళ్లీ వెంకయ్యకే అవకాశం - Sakshi

మళ్లీ వెంకయ్యకే అవకాశం

రాజ్యసభ స్థానానికి సిఫార్సు చేసిన కర్ణాటక బీజేపీ

 సాక్షి, బెంగళూరు: రాష్ట్ర శాసనసభల నుంచి రాజ్యసభకు జరిగే ఎన్నికల్లో కర్ణాటక నుంచి బీజేపీ అభ్యర్థిగా మరోసారి కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు పేరును కర్ణాటక బీజేపీ నాయకులు సిఫార్సు చేశారు. ఈ మేరకు ఆదివారం సాయంత్రం బెంగళూరులో జరిగిన కోర్‌కమిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాన్ని పార్టీ పెద్దలకు తెలపనున్నారు. శాసనసభ నుంచి శాసనమండలిలోని ఏడు స్థానాలకు జరగనున్న ఎన్నికల్లో ప్రస్తుత సంఖ్యాబలం ప్రకారం ఒక స్థానాన్ని బీజేపీ గెలుచుకోనుంది.

ఆ స్థానం కోసం మాజీ మంత్రి సోమణ్ణతోపాటు బీజేపీ బెంగళూరు నగర అధ్యక్షుడు సుబ్బనరసింహ పేర్లను కోర్‌కమిటీ సిఫార్సు చేసింది. ఇద్దరిలో ఒకరి పేరును పార్టీ పెద్దలు ఖరారు చేయనున్నారు. జేడీఎస్ సహాయంతో మరో ఎమ్మెల్సీ స్థానాన్ని దక్కించుకోవాలని కోర్ కమిటీలో తీర్మానించారు. ఈ రెండో స్థానం కోసం మాజీ మంత్రి కట్టా సుబ్రహ్మణ్యం నాయుడు పేరును సూచించే అవకాశం ఉందని సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement