పేర్లు బయటపెట్టిన ఛోటా రాజన్? | Chhota Rajan reveals names of Mumbai cops | Sakshi
Sakshi News home page

పేర్లు బయటపెట్టిన ఛోటా రాజన్?

Published Fri, Nov 6 2015 7:35 PM | Last Updated on Mon, Oct 8 2018 4:18 PM

పేర్లు బయటపెట్టిన ఛోటా రాజన్? - Sakshi

పేర్లు బయటపెట్టిన ఛోటా రాజన్?

మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంతో ఇప్పటికీ సంబంధాలున్న ముంబై పోలీసు అధికారుల పేర్లను ఛోటా రాజన్ వెల్లడించినట్లు తెలుస్తోంది. ముంబై పోలీసులలో చాలామంది దావూద్‌తో కుమ్మక్కయ్యారని, వారి నుంచి తనకు ప్రాణహాని ఉందని రాజన్ చెప్పడంతో అతడిని ముంబై కాకుండా ఢిల్లీకి తరలించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం సీబీఐ కస్టడీలో ఉన్న రాజన్.. ముంబై పోలీసులలో ఎవరెవరికి దావూద్‌తో సంబంధాలు ఉన్నాయో వాళ్ల పేర్లన్నీ బయటపెట్టాడని జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి.

రాజన్ మీద హత్యలు, బెదిరింపులు, బలవంతపు వసూళ్లు, డ్రగ్స్ అక్రమ రవాణా లాంటి 75కు పైగా నేరారోపణలు ఉన్నాయి. అయితే, రాజన్ అక్కడ బాలిలో విమానం అలా ఎక్కాడో లేదో.. ముంబై పోలీసు కమిషనర్ అహ్మద్ జావేద్ ప్రెస్‌మీట్ పెట్టి, మొత్తం అతడిమీద ఉన్న కేసులన్నింటినీ సీబీఐకి బదిలీ చేస్తున్నట్లు ప్రకటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement