అండర్ వరల్డ్ మాఫియా డాన్ ఛోటారాజన్ అరెస్టుపై భారత ప్రభుత్వం స్పందించింది. ఛోటా రాజన్‌ను అరెస్టుచేసినందుకు ఇంటర్ పోల్, మలేషియా పోలీసులకు కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ కృతజ్ఞతలు తెలిపారు. మరోవైపు ఛోటారాజన్ అరెస్టును కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) ధ్రువీకరించింది. ఇంటర్‌పోల్ అభ్యర్థన మేరకు మలేషియా పోలీసులు ఛోటారాజన్‌ను అదుపులోకి తీసుకున్నారని తెలిపింది.
ఇదిలా ఉండగా, ఛోటారాజన్‌పై ముంబైలో అధిక కేసులు ఉండటంతో అతన్ని భారత్‌కు రప్పించిన తర్వాత మహారాష్ట్ర పోలీసులకు అప్పగించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఛోటారాజన్‌ను తమకు అప్పగించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరనున్నట్టు మహారాష్ట్ర హోంమంత్రి రామ్‌షీండే తెలిపారు.