మాఫియా డాన్ ఛోటా రాజన్ అరెస్టు | mafia don chhota rajan arrested indonesia | Sakshi
Sakshi News home page

మాఫియా డాన్ ఛోటా రాజన్ అరెస్టు

Published Mon, Oct 26 2015 2:31 PM | Last Updated on Mon, Oct 8 2018 4:18 PM

మాఫియా డాన్ ఛోటా రాజన్ అరెస్టు - Sakshi

మాఫియా డాన్ ఛోటా రాజన్ అరెస్టు

దాదాపు రెండు దశాబ్దాలుగా భారత దేశంతో పాటు ప్రపంచంలోని అనేక దేశాలను వణికిస్తూ.. దొరక్కుండా తప్పించుకు తిరుగుతున్న అండర్ వరల్డ్ డాన్ ఛోటా రాజన్ అరెస్టయ్యాడు. ఆస్ట్రేలియా పోలీసులు అందించిన సమాచారం మేరకు అతడిని ఇంటర్‌పోల్ వర్గాలు ఇండోనేషియాలోని బాలిలో అరెస్టు చేశాయి. ఒకప్పుడు అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకు సన్నిహిత సహచరుడైన ఛోటా రాజన్.. ఆ తర్వాత అతడికి గట్టి ప్రత్యర్థిగా మారాడు. ముంబై పోలీసులు, భారత నిఘా ఏజెన్సీలు దాదాపు రెండు దశాబ్దాలుగా అతడి కోసం వెతుకుతున్నారు. 1995 నుంచి ఛోటా రాజన్ తప్పించుకుని తిరుగుతున్నాడు. ఇప్పటికీ ముంబై నేర సామ్రాజ్యంలో జరుగుతున్న అనేక ఘటనలలో అతడి హస్తం ఉందని చెబుతుంటారు.

దావూద్ ఇబ్రహీం - ఛోటా రాజన్ వర్గాల మధ్య చాలా కాలంగా గొడవలు ఉన్నాయి. వాళ్లలో దావూద్ గ్యాంగ్ ఇప్పుడు ఛోటా రాజన్‌కు సంబంధించిన సమాచారం అందించి ఉండొచ్చని కూడా చెబుతున్నారు. మన నిఘా సంస్థలు ఆ సమాచారం సేకరించాయో, లేదా వాళ్లెవరైనా ఇచ్చారో అప్పుడే చెప్పలేమని అంటున్నారు. భారతదేశానికి అతడిని డిపోర్ట్ చేసే అవకాశం ఉందని ఇండోనేసియా పోలీసులు, ఇంటర్‌పోల్ వర్గాలు చెబుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement