
సాక్షి, న్యూఢిల్లీ : జస్టిస్ లోయా కేసు విచారణకు సంబంధించి అనూహ్య మార్పు చోటుచేసుకుంది. ఈ కేసును విచారించనున్న న్యాయమూర్తుల్లో ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా కూడా ఉండనున్నారు. ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనానికి ఆయనే నేతృత్వం వహించనున్నారు. అంతకుముందు ఈ బెంచ్‌లో ఉన్న జస్టిస్ అరుణ్ మిశ్రాను పక్కకు తప్పించారు.
లోయా కేసుతో సహా పలు అంశాలను ప్రస్తావిస్తూ ఇటీవల సుప్రీంకోర్టులో న్యాయమూర్తులు మీడియా ముందుకు వచ్చి సుప్రీం చీఫ్ జస్టిస్ మిశ్రాపై ఆరోపణలు చేసిన సంక్షోభం సర్దుమణకముందే లోయా కేసు విచారణకు మిశ్రా నేతృత్వం వహించనుండటం గమనార్హం. గతంలో ఈ కేసు గతంలో జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని బెంచ్ విచారించేది. సోమవారం ఈ కేసు విచారణను దీపక్ మిశ్రా ఆధ్వర్యంలోని 10వ నెంబర్ కోర్టు విచారించనుంది.
Comments
Please login to add a commentAdd a comment