Deepak misra
-
సుప్రీంకోర్టుకు అనూహ్య ప్రశంసలు
సాక్షి, న్యూఢిల్లీ : గత కొంతకాలంగా పలు విమర్శలు ఎదుర్కొంటున్న సుప్రీంకోర్టుపై హఠాత్తుగా ప్రశంసల జల్లు కురిసింది. కర్ణాటకలో ఏర్పడిన రాజకీయ సంక్షోభంపై అనూహ్యంగా అర్ధరాత్రి సమావేశమై సుప్రీంకోర్టు సమస్యను రాజ్యాంగబద్ధంగా పరిష్కరించడమే అందుకు కారణం. కర్ణాటక అసంబ్లీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు సాధించిన భారతీయ జనతా పార్టీని ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర గవర్నర్ ఆహ్వానించడం, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన బీజేపీ నాయకుడు యడ్యూరప్పకు సభా విశ్వాసాన్ని పొందేందుకు 15 రోజులు సమయం ఇవ్వడం, గవర్నర్ చర్యలను సవాల్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించడం తదితర పరిణామాలు తెలిసిందే. జేడీఎస్, కాంగ్రెస్ కూటమికి అసెంబ్లీలో సగానికి పైగా సీట్లు ఉన్నప్పటికీ పిలువకుండా సగానికి కన్నా తక్కువ సీట్లు ఉన్న బీజేపీని గవర్నర్ ఆహ్వానించడాన్ని, శాసనసభ్యుల బేరసారాలకు వీలుగా 15 రోజుల సమయాన్ని కేటాయించడాన్ని కాంగ్రెస్ పార్టీ తన పిటిషన్లో సవాల్ చేసింది. వాస్తవానికి ఇది చావు, బతుకుల సమస్య కాదు కనుక, దీన్ని అర్ధరాత్రి అత్యవసరంగా విచారించాల్సిన అవసరం లేదు. అయినప్పటికీ త్రిసభ్య బెంచీ అర్ధరాత్రి సమావేశమై పిటిషన్‌ను విచారించింది. ఆ మరుసటి రోజే యడ్యూరప్పను అసెంబ్లీలో బలనిరూపణకు దిగాల్సిందిగా ఆదేశించింది. ఈ ఆదేశాలను వివిధ వర్గాల ప్రజలు ప్రశంసించారు. సకాలంలో మెజారిటి సభ్యుల మద్దతును సమీకరించడంలో విఫలపైన కారణంగా యడ్యూరప్ప బల నిరూపణకు ముందే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. కాంగ్రెస్ పిటిషన్‌ను విచారించిన త్రిసభ్య ధర్మాసనంలో ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా లేకపోయినప్పటికీ ఆయనే ఈ ధర్మాసనాన్ని ఏర్పాటు చేశారు. ఆయనపై కాంగ్రెస్ పార్టీ అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టిన నేపథ్యంలో దీపక్ మిశ్రా త్రిసభ్య ధర్మాసనాన్ని ఏర్పాటు చేయడం, అర్ధరాత్రయినా సరే పిటిషన్‌ను విచారించాల్సిందిగా ధర్మాసనానికి సూచించడం విశేషం. 2015లో యాకుబ్ మీనన్‌కు ఉరిశిక్ష పడినప్పుడు ఆయన క్షమాభిక్ష పిటిషన్‌ను కూడా అర్ధరాత్రి విచారించిందీ జస్టిస్ దీపక్ మిశ్రానే. ఓ పిటిషన్‌ను అర్ధరాత్రి విచారించడం సుప్రీం కోర్టు చరిత్రలో యూకుబ్ మీనన్‌ది మొదటిసారి కాగా, ఇప్పుడు కర్ణాటక రాజకీయ సంక్షోభంపై కాంగ్రెస్ పిటిషన్‌ను విచారించడం రెండోసారి. సుప్రీంకోర్టు పాలనాయంత్రాంగం సవ్యంగా లేదని, ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా తన ఇష్టానుసారం విచారణ బెంజీలను ఏర్పాటు చేస్తున్నారని ఆరోపిస్తూ నలుగురు సీనియర్ జడ్జీలు బయటకు వచ్చి జనవరి 12వ తేదీన అసాధారణంగా పత్రికా విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసిన విషయం తెల్సిందే. అప్పటి నుంచి సుప్రీంకోర్టు స్వతంత్రతపై పలు అనుమానలు, విమర్శలు వస్తూనే ఉన్నాయి. ఉత్కంఠగా కొనసాగిన కర్ణాటక రాజకీయాల్లో పడి ప్రజలు, విమర్శకులు మరో ముఖ్య విషయాన్ని మరచిపోయారు. అదే సుప్రీంకోర్టు జడ్జీగా ఉత్తరాఖండ్ ప్రధాన న్యాయమూర్తి కేఎం జోసఫ్ నియామకం. ఈ నియామకానికి సంబంధించిన తొలి సిఫార్సును నరేంద్ర మోదీ ప్రభుత్వం తిప్పి పంపడం, ఈ సిఫార్సును మరోసారి కేంద్రానికి నివేదించాలని జస్టిస్ చలమేశ్వర్ సహా ఐదుగురు సీనియర్ జడ్జీలతో కూడిన సుప్రీంకోర్టు కొలీజియం సూత్రప్రాయంగా ఏకగ్రీవంగా తీర్మానించడం తెల్సిందే. కొలీజియం రెండోసారి ఏకగ్రీవంగా చేసే ఏ ప్రతిపాదనైనా కేంద్ర ప్రభుత్వం యథాతధంగా ఆమోదించాల్సి ఉంటుంది. మే 16వ తేదీనే సుప్రీం కొలీజియం సమావేశమై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉండింది. అనూహ్యంగా ఆ రోజున కూడా సమావేశాన్ని వాయిదా వేశారు. జూన్‌లో పదవీ విరమణ చేస్తున్న జస్టిస్ చలమేశ్వర్‌రావు మే 18వ తేదీన అఖరి సారిగా తన సుప్రీం విధులను నిర్వహించారు. 19వ తేదీ నుంచి కోర్టుకు సెలవులు. సెలువులు ముగిసేనాటికి చలమేశ్వర్‌రావు కొలీజియం సభ్యత్వం పోతుంది. ఆయన స్థానంలో కొత్త జడ్జీ కొలీజియంలోకి వస్తారు. ఆయన జస్టిస్ కేఎం జోసఫ్ నియామకాన్ని వ్యతిరేకిస్తే మొత్తం తీర్మానం వీగిపోతుంది. కర్ణాటక రాజకీయాలకు సంబంధించి తన చిత్తశుద్ధిని చాటుకొని సుప్రీంకోర్టు స్వతంత్రతను కొంతమేరకు పరిరక్షించిన ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా, జోసఫ్ విషయంలో, సుప్రీంకోర్టు పాలనా వ్యవహారాల్లో పారదర్శకతను నిరూపించుకోవాల్సి ఉంది. -
సీజేఐ అభిశంసనకు సీపీఎం ప్రయత్నం
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తుల తిరుగుబాటు నేపథ్యంలో భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) దీపక్ మిశ్రాను అభిశంసించే దిశగా సీపీఎం ప్రయత్నాలు ప్రారంభించింది. తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు విపక్షాలను ఏకతాటిపైకి తెచ్చే పనిని సీపీఎం ప్రారంభించింది. అందులో భాగంగా సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మంగళవారం జేడీయూ తిరుగుబాటు నేత శరద్ యాదవ్‌ను, ఎన్సీపీ నేత తారీఖ్ అన్వర్‌ను కలసి చర్చించారు. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తులు జస్టిస్ జాస్తి చలమేశ్వర్, జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ మదన్ లోకూర్, జస్టిస్ కురియన్ జోసెఫ్‌లు జనవరి 12న మీడియా ముందుకు వచ్చి సీజేఐపై తీవ్ర ఆరోపణలు చేయడం తెలిసిందే. అభిశంసన తీర్మానంపై ప్రస్తుతం ఇతర ప్రతిపక్ష పార్టీలతో చర్చలు జరుపుతున్నామనీ, బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యే జనవరి 29 నాటికి ఈ అంశంపై స్పష్టత వస్తుందని ఏచూరి చెప్పారు. -
లోయ కేసు విచారణ అనూహ్య మార్పు
-
లోయ కేసు విచారణ అనూహ్య మార్పు
సాక్షి, న్యూఢిల్లీ : జస్టిస్ లోయా కేసు విచారణకు సంబంధించి అనూహ్య మార్పు చోటుచేసుకుంది. ఈ కేసును విచారించనున్న న్యాయమూర్తుల్లో ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా కూడా ఉండనున్నారు. ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనానికి ఆయనే నేతృత్వం వహించనున్నారు. అంతకుముందు ఈ బెంచ్‌లో ఉన్న జస్టిస్ అరుణ్ మిశ్రాను పక్కకు తప్పించారు. లోయా కేసుతో సహా పలు అంశాలను ప్రస్తావిస్తూ ఇటీవల సుప్రీంకోర్టులో న్యాయమూర్తులు మీడియా ముందుకు వచ్చి సుప్రీం చీఫ్ జస్టిస్ మిశ్రాపై ఆరోపణలు చేసిన సంక్షోభం సర్దుమణకముందే లోయా కేసు విచారణకు మిశ్రా నేతృత్వం వహించనుండటం గమనార్హం. గతంలో ఈ కేసు గతంలో జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని బెంచ్ విచారించేది. సోమవారం ఈ కేసు విచారణను దీపక్ మిశ్రా ఆధ్వర్యంలోని 10వ నెంబర్ కోర్టు విచారించనుంది. -
‘ఆ నలుగురిపై ఎలాంటి చర్యలుండవు’
సాక్షి, న్యూఢిల్లీ : సుప్రీంకోర్టు అంశాన్ని రాజకీయం చేయొద్దని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బీసీఐ) విజ్ఞప్తి చేసింది. బీసీఐ ఛైర్మన్ మనన్ కుమార్ మిశ్రా సోమవారమిక్కడ మాట్లాడుతూ...జడ్జీల మధ్య వివాదం ముగిసిందని, సమస్యలన్నీ పరిష్కారం అయ్యాయన్నారు. న్యాయవ్యవస్థ స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన వ్యవస్థ అని ఆయన అన్నారు. కోర్టు వ్యవహారాల్లో ఇతరుల జోక్యాన్ని అంగీకరించమని, అంతర్గతంగా అందరూ చర్చించుకున్నారని మనన్ కుమార్ మిశ్రా పేర్కొన్నారు. జడ్జిలందరూ విధులకు హాజరయ్యారని, కోర్టు కార్యక్రమాలు యథావిధిగా కొనసాగుతున్నాయన్నారు. న్యాయవ్యవస్థ పాలనా వ్యవహారాలపై సంచలన వ్యాఖ్యలు చేసిన ఆ నలుగురు జడ్జిలపై ఎలాంటి చర్యలుండవని బీసీఐ స్పష్టం చేసింది. మరోవైపు కేసుల కేటాయింపు విషయంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పనితీరు సక్రమంగా లేదంటూ వ్యాఖ్యలు చేసిన సీనియర్ న్యాయమూర్తులు జస్టిస్ జాస్తి చలమేశ్వర్, జస్టిస్ గొగోయ్, జస్టిస్ మదన్ బి.లోకూర్, జస్టిస్ కురియన్ జోసెఫ్ ఇవాళ యథావిధిగా విధులకు హాజరు అయ్యారు. ఇక సుప్రీంకోర్టు జడ్జిల మధ్య తలెత్తిన సంక్షోభం ముగిసినట్లేనని అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ ప్రకటించారు. ఓ జాతీయ మీడియా ఛానెల్‌తో మాట్లాడుతూ ఆయన ఈ విషయాన్ని తెలిపారు. ఈ విషయాన్ని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అధికారికంగా మీడియా ఎదుట ప్రకటించనుంది. -
థియేటర్లలో జనగణమన.. కేంద్రం యూటర్న్
సాక్షి, న్యూఢిల్లీ : సినిమాహాల్లో జాతీయ గీతాలాపన విషయంలో కేంద్రం వెనక్కి తగ్గింది. జనగణమన ప్రదర్శితమవుతున్న సమయంలో ప్రేక్షకులు తప్పనిసరిగా లేచి నిల్చొవాల్సిందేనని గతంలో ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ ఆదేశాలను నిలుపుదల చేసినట్లు సుప్రీంకోర్టుకు కేంద్రం తెలిపింది. సోమవారం సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం ఓ అఫిడవిట్ దాఖలు చేసింది. సినిమా మొదలయ్యే ముందు థియేటర్లలో జాతీయ గీతం అక్కర్లేదని కోర్టుకు తెలియజేసింది. జాతీయ గీతాన్ని ఎక్కడ? ఎప్పుడు? ఆలపించాలనే దానిపై మార్గదర్శకాల రూపకల్పన కోసం ఓ కమిటీని ఏర్పాటు చేసినట్లు ఏర్పాటు చేసినట్టు కేంద్రం పేర్కొంది. ఆ కమిటీ ఆరు నెలల్లో నివేదిక ఇస్తుందని, అప్పటి వరకు తాము ఇచ్చిన ఆదేశాలు నిలుపుదల చేసి 30 నవంబరు 2016 తీర్పు ముందునాటి స్థితిని పునరుద్ధరించాలని కోరింది. కాగా, నేడు ఈ వ్యవహారంలో దాఖలైన పిల్ విచారణకు రానుంది. జాతీయ గీతాలాపనకు సినిమా హాళ్లు వేదిక కాకూడదని దేశ వ్యాప్తంగా చర్చలు జరిగాయి. ఈ మేరకు ఓ ప్రజా ప్రయోజన వ్యాజ్యం కూడా దాఖలైంది. పౌరులు తమలోని దేశభక్తిని ఇలా నిరూపించుకోవాల్సిన అవసరం లేదని గతంలో న్యాయస్థానం తేల్చి చెప్పిన విషయం విదితమే. దీంతో తర్జన భర్జన పడిన ప్రభుత్వం దిగి వచ్చి ఈ నిర్ణయం తీసుకుంది. -
కావేరీ నది నుంచి నీళ్లు ఇవ్వలేం..
న్యూఢిల్లీ: కావేరి నది నుంచి తమిళనాడుకు నీళ్లు ఇవ్వలేమని కర్ణాటక ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు శుక్రవారం సుప్రీంకోర్టుకు కర్ణాటక సర్కారు సమాధానం ఇచ్చింది. ఇప్పటికే కావేరిలో 8 టీఎంసీల నీళ్లు తక్కువగా ఉన్నాయని, తమిళనాడుకు 50 టీఎంసీల నీళ్లు ఇవ్వలేమని చెప్పింది. ఈ సందర్భంగా న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా కీలక వ్యాఖ్యలు చేశారు. ‘బతుకు, బతికించు’ నియమాన్ని రెండు రాష్ట్రాలు అనుసరించాలని సూచించారు. రెండు రాష్ట్రాలు సహృద్భావంతో మెలగాలని ఆకాంక్షించారు. కావేరి ట్రిబ్యునల్ అవార్డు నిర్ణయం ఆధారంగా ఈ సమస్యను పరిష్కరించాలని సర్వోన్నత న్యాయస్థానం భావిస్తోంది. ఈ వ్యవహారంపై తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.