కావేరీ నది నుంచి నీళ్లు ఇవ్వలేం.. | Deepak misra says tamilnadu, karnataka to share water under rules only | Sakshi
Sakshi News home page

కావేరీ నది నుంచి నీళ్లు ఇవ్వలేం..

Published Fri, Sep 2 2016 8:46 PM | Last Updated on Mon, Sep 4 2017 12:01 PM

Deepak misra says tamilnadu, karnataka to share water under rules only

న్యూఢిల్లీ: కావేరి నది నుంచి తమిళనాడుకు నీళ్లు ఇవ్వలేమని కర్ణాటక ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు శుక్రవారం సుప్రీంకోర్టుకు కర్ణాటక సర్కారు సమాధానం ఇచ్చింది. ఇప్పటికే కావేరిలో 8 టీఎంసీల నీళ్లు తక్కువగా ఉన్నాయని, తమిళనాడుకు 50 టీఎంసీల నీళ్లు ఇవ్వలేమని చెప్పింది. ఈ సందర్భంగా న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా కీలక వ్యాఖ్యలు చేశారు. ‘బతుకు, బతికించు’  నియమాన్ని రెండు రాష్ట్రాలు అనుసరించాలని సూచించారు.

రెండు రాష్ట్రాలు సహృద్భావంతో మెలగాలని ఆకాంక్షించారు. కావేరి ట్రిబ్యునల్ అవార్డు నిర్ణయం ఆధారంగా ఈ సమస్యను పరిష్కరించాలని సర్వోన్నత న్యాయస్థానం భావిస్తోంది. ఈ వ్యవహారంపై తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement