అటు పంద్రాగస్టు వేడుకలు..ఇటు షాకింగ్ ఉదంతం
చండీగడ్: 71వ స్వాతంత్ర‍్య దినోత్సవం రోజే దారుణం చోటు చేసుకుంది. ఇండిపెండెన్స్ డే వేడుకలకు వెళ్లి వస్తున్న మైనర్ బాలిక అత్యాచారానికి గురి కావడం షాక్‌కు గురి చేసింది. పట్టపగలు బిజీరోడ్డులో పోలీసు స్టేషన్‌కు సమీపంలో ఈ విషాదం జరగడం కలకలం రేపింది. ప్రాథమిక సమాచారం 40 ఏళ్ల వ్యక్తి బాలికను బలవంతంగా ఎత్తుకెళ్లి లైంగిక దాడికి పాల్పడినట్టు తెలుస్తోంది.
జెండా వందన పండుగకు హాజరై వెళ్లి ఇంటికి తిరిగి వస్తుండగా ఈ అమానుషం చోటు చేసుకుంది. సెక్టార్ 23 లోని చిల్డ్రన్స్ ట్రాఫిక్ పార్కులో ఉన్న ఒక ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న బాలికను కిడ్నాప్ చేసి ఎత్తుకెళ్లి, లైంగిక దాడి చేసినట్టు పోలీసులు వెల్లడించారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం హాస్పిటల్‌కు తరలించినట్టు చెప్పారు. అత్యాచారం కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.