పనిమీద వెళ్లిన అమ్మాయిపై దారుణం | Class X student raped by five youths in UP | Sakshi
Sakshi News home page

పనిమీద వెళ్లిన అమ్మాయిపై దారుణం

Published Sat, Mar 26 2016 5:53 PM | Last Updated on Sat, Jul 28 2018 8:53 PM

పనిమీద వెళ్లిన అమ్మాయిపై దారుణం - Sakshi

పనిమీద వెళ్లిన అమ్మాయిపై దారుణం

కాన్పూర్: ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ జిల్లా కకాదేవ్ ప్రాంతంలో పదో తరగతి విద్యార్థిని (16)పై ఐదుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. పోలీసులు చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి.

శుక్రవారం రాత్రి ఈ అమ్మాయి ఇంట్లో నుంచి పనిమీద బయటకు వెళ్లింది. ఇంటి పక్కన ఉండే గొలు అనే యువకుడు ఆ సమయంలో మరో నలుగురు యువకులతో కలసి బాలికను తన ఇంట్లోకి బలవంతంగా లాక్కెళ్లాడు. ఆమెకు మత్తు మందు కలిపిన డ్రింక్ ఇచ్చి లైంగికదాడికి పాల్పడ్డారు. బాలిక ఇంటికి రాకపోయేసరికి ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు ఆమె సెల్ఫోన్కు ఫోన్ చేయగా బదులు ఇవ్వలేదు. కాగా ఫోన్ రింగ్ టోన్ సౌండ్ పక్క ఇంటి నుంచి వస్తున్నట్టు గుర్తించారు. గొలు ఇంట్లోకి వెళ్లి చూడగా బాధితురాలు అపస్మారక స్థితిలో ఉన్నట్టు గుర్తించారు. కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. గొలుతో పాటు చింటు, ఛోటు, ఆకాశ్, శుభమ్ తనపై అత్యాచారానికి పాల్పడినట్టు బాధితురాలు చెప్పింది. కేసు నమోదు చేసుకుని నిందితులను అరెస్ట్ చేసినట్టు పోలీసులు చెప్పారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement