
‘మోదీ రాక ఊరటనిచ్చింది’
కొచ్చి: కొల్లాం జిల్లాలోని పుట్టింగల్ గుడిలో బాణసంచా పేలుడు ఘటన తర్వాత పరిస్థితిని సమీక్షించేందుకు ప్రధాని మోదీ రావడం కేరళ ప్రజలకు పెద్ద ఊరటనిచ్చిందని సీఎం ఊమెన్ చాందీ చెప్పారు. ఆ సమయంలో మోదీ, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పర్యటనకు రాష్ట్ర డీజీపీ టీపీ సేన్‌కుమార్ అభ్యంతరం వ్యక్తం చేశారన్న కథనాల నేపథ్యంలో సీఎం స్పందించారు.
‘ఈ విపత్తు సమయంలో ప్రధాని, రాహుల్ రావడం, సలహాలిచ్చి సహాయంగా నిలవడం కేరళకు గొప్ప విషయం’ అని చెప్పారు. కాగా, ప్రమాదం జరిగిన 12 గంటల్లోపే ప్రధాని రాకపై సేన్‌కుమార్ ఘటన రోజు అభ్యంతరం వ్యక్తంచేశారు. పోలీసులంతా సహాయక చర్యల్లో నిమగ్నమై ఉన్నారన్నారు.