Cm Oommen Chandy
-
బాధితురాలి సోదరికి ప్రభుత్వ ఉద్యోగం: చాందీ
పెరంబవూర్: సామూహిక అత్యాచారానికి గురై, ప్రాణాలు కోల్పోయిన లా కాలేజీ విద్యార్థిని కుటుంబసభ్యులను కేరళ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ బుధవారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కేసు విచారణ సరైన మార్గంలోనే కొనసాగుతోందన్నారు. బాధితురాలి సోదరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని సీఎం ఊమెన్ చాందీ హామీ ఇచ్చారు. కాగా ఈనెల 16న కేరళలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఎన్నికల కమిషన్ అనుమతితోనే తాను ఈ హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఈ కేసుపై ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి పెట్టిన విషయం తెలిసిందే. అసలేం జరిగింది?: ఏప్రిల్ 28న ఎర్నాకుళం జిల్లా పెరంబవూర్‌లో లా కాలేజీ విద్యార్థినిపై ఆమె ఇంట్లోనే అత్యాచారం చేయటంతోపాటు నిర్భయ ఘటనలాగా పదునైన ఆయుధాలతో దాడిచేసి చంపేశారు. ఆమె పెనుగులాడినట్లు ఆధారాలున్నాయని, మెడ, ఛాతీతోపాటు శరీరంలోని ఇతర భాగాలపై 13 గాయలు అయ్యాయి. దీనిపై కేరళ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చెలరేగింది. ఎస్సీ, ఎస్టీ కమిషన్ సుమెటో కేసును నమోదు చేసి విచారణకోసం సిట్‌ను ఏర్పాటు చేయాలని ఆదేశించగా.. కేరళ మానవ హక్కుల కమిషన్ కేసును క్రైమ్ బ్రాంచ్‌కు బదిలీ చేయాలని ఆదేశించింది. మరోవైపు ఎర్నాకుళంలో హతురాలు చదువుకుంటున్న కాలేజీ విద్యార్థినులు భారీ ర్యాలీ నిర్వహించారు. -
‘కేరళ నిర్భయ’ కేసులో మలుపులు
♦ పోలీసుల అదుపులో నలుగురు అనుమానితులు ♦ కొంతకాలంగా బెదిరింపులు వస్తున్నాయన్న యువతి తల్లి కొచ్చి: కేరళలో పెరుంబవూర్‌లో 30 ఏళ్ల దళిత మహిళను అత్యాచారం చేసి, హత్యచేసిన కేసులో (నిర్భయ ఘటన తరహా) ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మే 16న కేరళలో జరగనున్న ఎన్నికలకు ముందు ఈ ఘటన సంచలనం రేపుతోంది. సీఎం ఊమెన్ చాందీ ఈ కేసుపై ప్రత్యేకంగా దృష్టిపెట్టారు. అయితే అదుపులోకి తీసుకున్న నలుగురు అసలైన నేరస్తులా కాదా అనే అంశంపై స్పష్టత లేద ని పోలీసులు అంటున్నారు. హతమారుస్తామంటూ ఆ యువతికి కొంతకాలంగా బెదిరింపు కాల్స్ వస్తున్నాయని ఆమె తల్లి రాజేశ్వరి తెలిపారు. పలుమార్లు పోలీసులకు ఫిర్యాదుచేసినా, పట్టించుకోలేదన్నారు. అసలేం జరిగింది?: ఏప్రిల్ 28న ఎర్నాకుళం జిల్లా పెరంబవూర్‌లో లా కాలేజీ విద్యార్థిని అయిన దళిత మహిళను ఆమె ఇంట్లోనే అత్యాచారం చేయటంతోపాటు నిర్భయ ఘటనలాగా పదునైన ఆయుధాలతో దాడిచేసి చంపేశారు. ఆమె పెనుగులాడినట్లు ఆధారాలున్నాయని, మెడ, ఛాతీతోపాటు శరీరంలోని ఇతర భాగాలపై 13 గాయాలున్నాయని పోలీసులు చెప్పారు. దీనిపై కేరళ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చెలరేగింది. ఎస్సీ, ఎస్టీ కమిషన్ సుమొటో కేసును నమోదు చేసి విచారణకోసం సిట్‌ను ఏర్పాటుచేయాలని ఆదేశించగా.. కేరళ మానవ హక్కుల కమిషన్ కేసును క్రైమ్ బ్రాంచ్‌కు బదిలీ చేయాలని ఆదేశించింది. ఎర్నాకుళంలో హతురాలు చదువుకుంటున్న కాలేజీ విద్యార్థినులు భారీ ర్యాలీ నిర్వహించారు. -
‘మోదీ రాక ఊరటనిచ్చింది’
కొచ్చి: కొల్లాం జిల్లాలోని పుట్టింగల్ గుడిలో బాణసంచా పేలుడు ఘటన తర్వాత పరిస్థితిని సమీక్షించేందుకు ప్రధాని మోదీ రావడం కేరళ ప్రజలకు పెద్ద ఊరటనిచ్చిందని సీఎం ఊమెన్ చాందీ చెప్పారు. ఆ సమయంలో మోదీ, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పర్యటనకు రాష్ట్ర డీజీపీ టీపీ సేన్‌కుమార్ అభ్యంతరం వ్యక్తం చేశారన్న కథనాల నేపథ్యంలో సీఎం స్పందించారు. ‘ఈ విపత్తు సమయంలో ప్రధాని, రాహుల్ రావడం, సలహాలిచ్చి సహాయంగా నిలవడం కేరళకు గొప్ప విషయం’ అని చెప్పారు. కాగా, ప్రమాదం జరిగిన 12 గంటల్లోపే ప్రధాని రాకపై సేన్‌కుమార్ ఘటన రోజు అభ్యంతరం వ్యక్తంచేశారు. పోలీసులంతా సహాయక చర్యల్లో నిమగ్నమై ఉన్నారన్నారు. -
చాందీకి ఉపశమనం
సోలార్ కుంభకోణంలో ఎఫ్ఐఆర్ నమోదుపై హైకోర్టు స్టే విజిలెన్స్ జడ్జి తప్పుకోవాలని ఆదేశం తిరువనంతపురం: కేరళ ప్రభుత్వాన్ని కుదిపేసిన సోలార్ స్కాంలో సీఎం ఊమెన్ చాందీకి కేరళ హైకోర్టు తీర్పు ఉపశమనం కలిగించింది. చాందీపై ఎఫ్ఐఆర్ దాఖలు చేయాలంటూ.. విజిలెన్స్ జడ్జి ఇచ్చిన ఆదేశాలపై హైకోర్టు స్టే విధించింది. దీంతో పాటు సీఎం, మంత్రిపై ఎఫ్ఐఆర్కు ఆదేశాలిచ్చిన సదరు జడ్జిని విధులనుంచి తప్పుకోవాలని అధికారులను ఆదేశించింది. ‘జడ్జి తన పరిధిని తెలుసుకోకుండా, వాస్తవాలు గుర్తించకుండా న్యాయపరమైన తప్పిదాలు చేశారు’ అని హైకోర్టు మండిపడింది. హైకోర్టు తీరుపై నిరసన తెలిపిన విజిలెన్స్ జడ్జి ఎస్ఎస్ వాసన్.. స్వచ్ఛంద పదవీ విరమణ (మే, 2017లో రిటైర్మెంట్ ఉంది)కు అనుమతివ్వాలని హైకోర్టు రిజిస్ట్రార్‌ను కోరారు. కాగా, చాందీ స్పందిస్తూ.. ‘ఎప్పటికైనా నిజమే గెలుస్తుంది. నాపై ఆరోపణలన్నీ రాజకీయ కుట్రలో భాగమని ప్రజలకు అర్థమైంది. నిర్దోషిగా బయటికొస్తా’ అని అన్నారు. లిక్కర్ లాబీ, సీపీఎం కలసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్రపన్నుతున్నాయన్నారు. సరిత తాజా ఆరోపణలు.. స్కాంలో.. సీఎంపై ఆరోపణలు చేసిన సరిత నాయర్ శుక్రవారమూ సోలార్ కమిషన్ ముందు విచారణకు హాజరయ్యారు. సీఎంతో పాటు ఆయన కుమారుడు చాందీ ఊమెన్‌పై తాజాగా ఆరోపణలు చేశారు. ‘కేరళ పునరుత్పాదక శక్తి సహకార సొసైటీ స్థాపించమని సీఎం చెప్పారు. ఇందులో ఆయన కుమారుడితోపాటు పలువురు కుటుంబ సభ్యులనూ చేర్చుకోమన్నారు. ఇప్పటికే ఓ అమెరికా కంపెనీలో భాగస్వామిగా ఉన్న సీఎం కుమారుడు.. అక్కడ తయారైన సోలార్ ప్లేట్లను ఈ కంపెనీ దిగుమతి చేసుకోవాలన్నారు’ అని ఆరోపించారు. కాగా, చాందీ రాజీనామా చేయాలని విపక్ష ఎల్డీఎఫ్ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపట్టింది. డీవైఎఫ్ఐ కార్యకర్తలు విధ్వంసానికి దిగారు. -
అవును నేను సీఎంకు లంచమిచ్చాను..
-
అవును నేను సీఎంకు లంచమిచ్చాను..
సీఎంకు లంచమిచ్చానన్న ప్రధాన నిందితురాలు తిరువనంతపురం/కొచ్చి: అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ సారథ్యంలోని కేరళ యూడీఎఫ్ ప్రభుత్వం ‘సోలార్ స్కామ్’ వేడికి ఉక్కిరిబిక్కిరవుతోంది. ఇప్పటికే ఇద్దరు మంత్రుల మెడకు చుట్టుకున్న ఈ స్కామ్... తాజాగా ముఖ్యమంత్రి ఊమెన్ చాందీపైకి మళ్లింది. రాష్ట్రంలో మెగా సోలార్ ప్రాజెక్టులు నెలకొల్పడానికి గాను అనుమతుల కోసం సీఎం చాందీ కీలక అనుచరుడికి రూ.1.9 కోట్లు ఇచ్చినట్టు ఈ కేసులో ప్రధాన నిందితురాలైన సరిత ఆరోపించారు. కేసు విచారిస్తున్న జస్టిస్ శివరాజన్ కమిషన్ ముందు ఈ మేరకు వాంగ్మూలమిచ్చారు. అంతేకాకుండా ఆయన కేబినెట్లోని విద్యుత్ శాఖ మంత్రి ఆర్యదన్ మహమ్మద్ పీఏకి రూ.40 లక్షలు లంచంగా ఇచ్చినట్టు వెల్లడించారు. కేరళలో సోలార్ ప్రాజెక్టుల కోసం చాందీ మాజీ పీఏ జిక్కుమన్ తనను రూ.7 కోట్లు లంచం అడిగారని, ఆ మొత్తాన్నీ ఢిల్లీలో ఉన్న సీఎం అనధికార అనుచరుడైన థామస్ కురువిల్లాకు అందజేయాలని చెప్పారని సరిత పేర్కొన్నారు. ‘చాందినీ చౌక్ షాపింగ్ మాల్ పార్కింగ్ గ్రౌండ్లో కురువిల్లాకు రూ.1.10 కోట్లు ఇచ్చా. డిసెంబర్ 27, 2012న విమానాశ్రయానికి వెళుతుండగా విజ్ఞాన్ భవన్లో చాందీని కలిశా’ అని సరిత కమిషన్ ముందు వెల్లడించారు. అయితే ఈ ఆరోపణలను చాందీ, ఆర్యదన్లు ఖండించారు. కేసును తప్పుదోవ పట్టించడానికే సరిత ఇలా మాట్లాడుతున్నారని సీఎం చెప్పారు. -
తప్పు ఒప్పుకోకుంటే.. న్యాయచర్య
మోదీ ప్రభుత్వానికి కేరళ సర్కారు హెచ్చరిక తిరువనంతపురం/న్యూఢిల్లీ: గోమాంసం వడ్డించారన్న ఆరోపణలపై ఢిల్లీ కేరళ భవన్‌పై పోలీసులు దాడి వివాదం బుధవారం మరింత ముదిరింది. తప్పుడు ఫిర్యాదు చేశారన్న అభియోగాల(107/151సీఆర్పీసీ)పై హిందూసేన చీఫ్ విష్ణుగుప్తాను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరచారు. ఈ మొత్తం వ్యవహారం వల్ల కేంద్ర, రాష్ట్ర సంబంధాలపై ఏర్పడిన ప్రతిష్టంభన బుధవారమూ కొనసాగింది. కేరళ కేబినెట్ అత్యవసరంగా సమావేశమై చర్చించింది. ఢిల్లీ పోలీసులు తాము చట్టం ప్రకారమే వ్యవహరించామని, క్యాంటీన్ తనిఖీ తమ విధుల్లో భాగమని చేస్తున్న వాదనను కేంద్రం సమర్థిస్తే న్యాయపర చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. పోలీసులు రాష్ట్ర ప్రభుత్వ అధికారుల అనుమతి తీసుకోకుండా ప్రవేశించటం చట్టాల ఉల్లంఘనేనని సీఎం ఊమెన్ చాందీ అన్నారు. గోమాంసంపై ఢిల్లీలో నిషేధమున్న విషయం తమకు తెలుసని.. దాన్ని వడ్డించనేలేదని, గేదె మాంసాన్నే వడ్డించారని తెలిపారు. కేరళ భవన్లో బుధవారం తిరిగి గేదె మాంసాన్ని వండి వడ్డించారు. 45 నిమిషాల్లో ఈ వంటకం హాట్‌కేక్‌లా అమ్ముడుపోయింది. రూ.50 చొప్పున 70 ప్లేట్లు అమ్మారు. పీఎంఓకు నివేదిక! ఈ వివాదంపై కేంద్ర హోం శాఖ ప్రధానమంత్రి కార్యాలయానికి నివేదిక ఇవ్వనుంది. దీని కోసం ఢిల్లీ పోలీసుల నుంచి నివేదిక తీసుకుంది. సోమవారం కేరళభవన్‌లో గోమాంసం వడ్డిస్తున్నట్లు ఫోన్ రావడంతో అక్కడికెళ్లామని పోలీసులు చెప్పారు. గోమాంసం వడ్డించడం లేదని తెలియడంతో, అప్రమత్తంగా ఉండాలని.. అవసరమైతే తమను సంప్రదించాలని క్యాంటీన్ సిబ్బందికి తెలిపి.. భవన్‌గేట్, దాని పరిసర ప్రాంతాల్లో భద్రత ఏర్పాటు చేశామని హోం శాఖకు తెలిపారు. -
కేరళ భవన్లో గోమాంస వివాదం
కేరళ భవన్లో ఢిల్లీ పోలీసుల హల్చల్ క్యాంటీన్లో వడ్డించింది గేదె మాంసమన్న కేరళ ప్రభుత్వం న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలోని కేరళ భవన్ క్యాంటీన్లో గోమాంసం వడ్డిస్తున్నారంటూ చెలరేగిన వివాదం రాజకీయ రంగు పులుముకుంది. క్యాంటీన్లో హిందూ సేన కార్యకర్తలు, ఢిల్లీ పోలీసులు హంగామా చేయటంతో వివాదం రేగింది. ఈ ఘటన కేరళ భవన్లో సోమవారం సాయంత్రం హిందూసేన కార్యకర్తలు ప్రవేశించి ఆందోళన చేయటంతో మొదలైంది. కేరళ భవన్ క్యాంటీన్ మెనూలో బీఫ్ కూడా ఉంది. మిగతా ఆహార పదార్థాల పేర్లన్నీ ఇంగ్లీష్‌లో ఉండి బీఫ్ పేరును మలయాళంలో పేర్కొన్నారు. విషయాన్ని తెలుసుకున్న హిం దూసేన కార్యకర్తలు కేరళ భవన్‌లోకి ప్రవేశించి బీఫ్ వండకూడదంటూ ఆందోళన చేశారు. కేరళభవన్ సిబ్బంది పోలీస్ కంట్రోల్‌రూమ్‌కి సమాచారమిచ్చారు. దీంతో 20మంది పోలీసు లు కేరళభవన్‌కు చేరుకున్నారు. అప్పటికే హిందూసేన కార్యకర్తలు పారిపోయారు. అయితే పోలీసులు క్యాంటీన్లోకి వెళ్లి గోమాం సం వండారా లేదా అని పరిశీలించటం, సిబ్బందిని ప్రశ్నించటంతో దుమారం రేగింది. అది గేదె మాంసం: తాము క్యాంటిన్లో వడ్డిస్తున్నది గోమాంసం కాదని, గేదె మాంసమని కేరళ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జీజీ థామ్సన్ స్పష్టం చేశారు. రెసిడెంట్ కమిషనర్ అనుమతి లేకుండా కేరళ భవన్‌లోకి చొరబడిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. కఠిన చర్యలు తీసుకోవాలి: ఊమెన్‌చాందీ గోమాంసం వడ్డిస్తున్నారన్న ఆరోపణలపై కేరళభవన్‌పై దాడి చేయటం దారుణమని ఢిల్లీ పోలీసులపై, దుండగులపై కఠిన చర్యలు తీసు కోవాలని కేరళ సీఎం ఊమెన్ చాందీ ప్రధానికి లేఖ రాశారు. కాగా, ఢిల్లీ పోలీసులు కేరళభవన్‌పై దాడి చేయనే లేదని, ఆందోళన జరుగుతోందంటూ అక్కడి సిబ్బంది నుంచి వచ్చిన ఫిర్యాదు మేరకే పోలీసులు వెళ్లారని, ఢిల్లీ పోలీస్ కమిషనర్ బీఎస్ బస్సీ అన్నారు. ఫిర్యాదు చేసిన వ్యక్తిపై చర్య తీసుకుంటామన్నారు. -
కుక్కలు కనిపిస్తే.. ఎగుమతేనట!
కేరళలో గ్రామ సింహాలకు భలే చిక్కొచ్చిపడింది. ఇకపై మొరిగినా, మొరగకపోయినా, ఎవరినీ కరవకపోయినా కూడా వీధుల్లో కనిపిస్తే చాలు.. వాటిని ఖైమా చేసే పనిలో పడ్డారు ఎర్నాకుళం జిల్లా గ్రామ పంచాయతీల వారు. మన మున్సిపాల్టీల వారు వీధికుక్కల్ని ఒకచోట పట్టుకుని మరోచోట విడిచిపెడుతుంటారు. కానీ కేరళ గ్రామ పంచాయతీల వారు మాత్రం వీటిని ఎగుమతి చేయాలని తీర్మానించారు! వీధికుక్కల్ని ఎగుమతి చేస్తే ఇటు సమస్య తప్పడంతో పాటు అటు ఆదాయమూ వస్తుందన్నది వీరి ప్లాన్. ఈశాన్య రాష్ట్రాలు, చైనా, కొరియా జనాలకు వీధికుక్కలను చూస్తేనే నోట్లో నీళ్లూరతాయట. అందుకే.. వీధికుక్కలను అక్కడికి ఎగుమతి చేస్తే పంట పండినట్లేనని వీరు చెబుతున్నారు. ఎర్నాకుళం జిల్లా సర్పంచుల సమావేశంలో ఎదక్తువయల్ గ్రామ సర్పంచ్ గురువారం దీనిపై ఓ తీర్మానం ప్రవేశపెట్టగా ఏకగ్రీవంగా ఆమోదం లభించింది. ఈ తీర్మానాన్ని రాష్ట్ర ప్రభుత్వమూ ఆమోదిస్తే కోళ్ల పెంపకం మాదిరిగా.. కుక్కల పెంపకమూ జోరందుకుంటుందనీ ఆయన సెలవిచ్చారు. అన్నట్టూ.. 2014-15లో కేరళలో 1.06 లక్షల మందిని వీధికుక్కలు కరిచాయట! వీధికుక్కల దాడులు పెరుగుతుండటంతో కేరళ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ ఇటీవల ఏకంగా అఖిలపక్ష భేటీనే నిర్వహించారు! కుక్కలకు కుటుంబ నియంత్రణ కార్యక్రమాలు చేపట్టడం, రేబిస్ సోకినవాటిని హతమార్చడం వంటివాటిపై సమగ్ర ప్రణాళిక గురించి చర్చించారు. ఏదేమైనా వీధికుక్కల సమస్యను ఇలా వదిలించుకోవ డమేంటని కేంద్ర మంత్రి మేనకా గాంధీ లాంటి జంతుప్రేమికులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.