కామన్ మేనేజ్‌మెంట్ అడ్మిషన్ టెస్ట్(సీమాట్) 2015-16 పరీక్షల షెడ్యూల్‌ను ఆలిండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ) గురువారం ప్రకటించింది.
సాక్షి, హైదరాబాద్: కామన్ మేనేజ్‌మెంట్ అడ్మిషన్ టెస్ట్(సీమాట్) 2015-16 పరీక్షల షెడ్యూల్‌ను ఆలిండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ) గురువారం ప్రకటించింది. దీనికి సంబంధించి మొదటి పరీక్ష సెప్టెంబర్‌లో జరగ్గా రెండోది ఫిబ్రవరి 19 నుంచి 22 వరకు జరగనుంది. రిజిస్ట్రేషన్లకు సంబంధించి ఆన్‌లైన్ విండో గురువారం నుంచి ప్రారంభం కాగా జనవరి 5 చివరి తేదీ. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారు అర్హులు. వివరాలకు www.aicte-cmat.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని ఏఐసీటీఈ ఉపాధ్యక్షుడు అవినాష్ ఎస్ పంత్ పేర్కొన్నారు.