బర్ధన్‌కు నేతల తుది వీడ్కోలు
ఢిల్లీలో అంత్యక్రియలు పూర్తి
సాక్షి, న్యూఢిల్లీ: వామపక్ష కురువృద్ధుడు, సీపీఐ మాజీ ప్రధాన కార్యదర్శి ఏబీ బర్ధన్ పార్థివదేహానికి సోమవారం ఢిల్లీలోని నిగంబోధ్‌ఘాట్ విద్యుత్ దహనవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. సోమవారం ఉదయం సీపీఐ కేంద్ర కార్యాలయం అజోయ్‌భవన్‌లో బర్ధన్ భౌతికకాయం వద్ద ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, ప్రకాశ్ కారత్, బృందా కారత్, సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి, ఎంపీ డి.రాజా, టీడీపీ ఎంపీ కొనకళ్ల నారాయణ, గురుదాస్‌దాస్ గుప్తా, కేంద్ర మంత్రి సుజనా చౌదరి, రాష్ట్ర మంత్రులు, రాష్ట్ర నాయకులు నారాయణ నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో చైనా దౌత్య కార్యాలయం డెప్యూటీ చీఫ్ లూ జిన్ సంగ్‌సహా పలువురు వామపక్షపార్టీల నేతలు, కార్యకర్తలు అజోయ్‌భవన్ చేరుకుని బర్ధన్‌కు నివాళులర్పించారు. పలురాష్ట్రాల నుంచి వచ్చిన వామపక్ష నేతలు, కార్యకర్తలు బర్ధన్ అంతిమయాత్రలో పాల్గొని తుదివీడ్కోలు పలికారు.