నేడు బర్ధన్‌కు తుది వీడ్కోలు
న్యూఢిల్లీ: సీపీఐ సీనియర్‌నేత ఏబీ బర్ధన్ అంత్యక్రియలు సోమవారం మధ్యాహ్నం ఇక్కడి నిగమ్‌బోధ్ ఘాట్ జరగనున్నాయి. 92 ఏళ్ల బర్ధన్ అనారోగ్యంతో శనివారం కన్నుమూయడం తెలిసిందే. సోమవారం ఉదయం బర్ధన్ భౌతికకాయాన్ని కార్యకర్తల సందర్శనార్థం పార్టీ కేంద్ర కార్యాలయం లో ఉంచుతారు. బర్ధన్ మృతిపై సీపీఎం, డీఎంకే తదితర పలు పార్టీలు సంతాపం తెలిపాయి. బర్ధన్ విలువలున్న నేత అని బీజేపీ నేత ఎల్‌కే అద్వానీ అన్నారు. బర్ధన్ మృతి దేశ వామపక్ష, కార్మిక ఉద్యమానికి తీరని లోటని సీపీఐ ప్రధాన కార్యద్శి సురవరం సుధాకరరెడ్డి పేర్కొన్నారు.