భోపాల్ : మధ్యప్రదేశ్‌కు చెందిన నలుగురు బీజేపీ ఎమ్మెల్యేలు తనతో టచ్‌లో ఉన్నారని కంప్యూటర్ బాబాగా పేరొందిన స్వామీజీ నాందాస్ త్యాగి అన్నారు. మధ్యప్రదేశ్ పార్టీ నాయకత్వం పట్ల ఆ పార్టీ ఎమ్మెల్యేలు పలువురు అసంతృప్తితో ఉన్నారని ఆయన చెప్పుకొచ్చారు. మధ్యప్రదేశ్ సీఎం కమల్ నాథ్ గ్రీన్‌సిగ్నల్ లభిస్తే బీజేపీ ఎమ్మెల్యేల పేర్లు వెల్లడిస్తానని కంప్యూటర్ బాబా పేర్కొనడం గమనార్హం.
మధ్యప్రదేశ్ అసెంబ్లీలో న్యాయవాదుల పరిరక్షణ బిల్లుకు అనుకూలంగా ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలు బుధవారం ఓటు వేసిన నేపథ్యంలో బాబా ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా, క్రాస్ ఓటింగ్‌పై తీవ్రంగా స్పందించిన ఆర్‌ఎస్‌ఎస్ బీజేపీ రాష్ట్ర శాఖ నుంచి సవివర నివేదిక కోరినట్టు సమాచారం. కర్ణాటకలో కాంగ్రెస్-జేడీఎస్ సర్కార్ కుప్పకూలిన క్రమంలో బీజేపీ నుంచి ఎదురయ్యే ముప్పును తిప్పికొట్టేందుకు మధ్యప్రదేశ్ సీఎం కమల్‌నాథ్ అప్రమత్తమయ్యారు. తమ ప్రభుత్వం ఐదేళ్ల పదవీకాలం పూర్తిచేస్తుందని స్పష్టం చేశారు. తమ పార్టీ ఎమ్మెల్యేలు ఎవరూ అమ్ముడుపోయేందుకు సిద్ధంగా లేరని ఆయన చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment